‘కెరటం’ అనే చిన్న సినిమా ద్వారా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చి.. అనంతరం టాప్ హీరోలతో సినిమాలు చేసి టాప్ హీరోయిన్గా ఎదిగింది రకుల్ ప్రీత్ సింగ్. ఇక్కడ సినిమాలు చేస్తూనే బాలీవుడ్‌లోనూ పాగా వేయాలని గట్టి ప్రయత్నాలే చేస్తోంది. అయితే జాకీ భగ్నానీతో ప్రేమ విషయం గురించి ఈ భామ గతేడాది అభిమానులతో పంచుకున్న విషయం తెలిసిందే.
ఈ విషయంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది రకుల్. అందులో.. ‘మా ప్రేమ విషయం గురించి దాచడానికి ఏమి లేదని మా ఇద్దరి అభిప్రాయం. మీరు ఒకటిగా ఉన్నప్పుడు ఒకరికొకరు ఆ గౌరవాన్ని ఇచ్చుకోవడం చాలా మంచిది. తమ రిలేషన్ గురించి చెప్పకుండా దాచుకునే చాలా జంటల గురించి మనకు తెలుసు. కానీ మా ఇద్దరికీ కూడా అలాంటి ఆలోచనలు, భయాలు లేవ’ని చెప్పింది.
అలాగే రకుల్ బర్త్ డే సందర్భంగా జాకీ పోస్ట్‌పై మాట్లాడుతూ.. ‘అతను నాకు పబ్లిక్‌గా విషెస్ చెప్తాడని తెలుసు. కానీ అంత పోయిటిక్గా చెబుతాడని మాత్రం తెలియదు. అది నాకు చాలా ఆశ్చర్యానికి కలిగించింద’ని తెలిపింది.