Tollgateకు వ్యతిరేకంగా నిరాహారదీక్ష

ABN , First Publish Date - 2022-07-05T14:10:02+05:30 IST

మదురై జిల్లా తిరుమంగళం నియోజకవర్గం గబ్బలూరు టోల్‌గేట్‌ తొలగించాలని కోరుతూ అనుమతి లేకుండా సోమవారం నిరాహారదీక్షలో పాల్గొన్న అన్నాడీఎంకే

Tollgateకు వ్యతిరేకంగా నిరాహారదీక్ష

                                - మాజీ మంత్రి సహా వంద మంది అరెస్టు


ప్యారీస్‌(చెన్నై), జూలై 4: మదురై జిల్లా తిరుమంగళం నియోజకవర్గం గబ్బలూరు టోల్‌గేట్‌ తొలగించాలని కోరుతూ అనుమతి లేకుండా  సోమవారం నిరాహారదీక్షలో పాల్గొన్న అన్నాడీఎంకే నాయకుడు, మాజీ మంత్రి ఆర్బీ ఉదయకుమార్‌ సహా వంద మందిని అరెస్ట్‌ చేశారు. గబ్బలూరు టోల్‌గేట్‌ను తొలగించాలనే డిమాండ్‌తో స్థానికులు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో, తాజాగా ఈ టోల్‌గేట్‌లో వాహనాల నుంచి వసూలుచేసే సుంకాన్ని పెంచారు. దీనికి స్థానికులు తీవ్ర అభ్యంతరం తెలుపుతూ వారం రోజులుగా ఆందోళన చేపట్టారు. ఇదిలా ఉండగా, అన్నాడీఎంకే మాజీ మంత్రి ఆర్బీ ఉదయకుమార్‌ ఆందోళనకారులకు మద్దతుగా సోమవారం ఉదయం ఆ టోల్‌ ప్లాజాను ముట్టడించి తమ పార్టీ కార్యకర్తలతో కలసి నిరాహారదీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. అయితే ఇందుకు అనుమతి లేకపోవడంతో పోలీసులు ఉదయకుమార్‌ సహా వంద మందిని అరెస్ట్‌ చేశారు.

Updated Date - 2022-07-05T14:10:02+05:30 IST