Tollgate ఎత్తివేయాలని రాస్తారోకో

ABN , First Publish Date - 2021-11-25T15:53:24+05:30 IST

తూత్తుకుడి జిల్లా ఖయత్తారు నగర శివారులోని టోల్‌గేట్‌ ఎత్తివేయాలని కోరుతూ బుధవారం ఉదయం రాస్తారోకోలో పాల్గొన్న వ్యాపారులు 50 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మదురై-తిరునల్వేలి జాతీయ

Tollgate ఎత్తివేయాలని రాస్తారోకో

                         - 50 మంది అరెస్టు


ప్యారీస్‌(చెన్నై): తూత్తుకుడి జిల్లా ఖయత్తారు నగర శివారులోని టోల్‌గేట్‌ ఎత్తివేయాలని కోరుతూ బుధవారం ఉదయం రాస్తారోకోలో పాల్గొన్న వ్యాపారులు 50 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మదురై-తిరునల్వేలి జాతీయ నాలుగు రోడ్ల కూడలిలో ఖయత్తారు సమీపంలో సాలైపుదూర్‌ ప్రాంతంలో టోల్‌ప్లాజా పనిచేస్తోంది. ఖయత్తారు, పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ వాహనాలకు ఎలాంటి టోల్‌ పన్ను చెల్లించకుండా వెళ్లి వస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ఫాస్టాగ్‌ అమలుకు వచ్చింది. దీంతో ఈ ప్రాంత ప్రజలకు టోల్‌ పన్ను తప్పనిసరి చేయడంతో స్థానిక వ్యాపారులు, మహిళలు రోడ్డుపై భైఠాయించి, తమ ప్రాంతంలో ఉన్న టోల్‌గేట్‌ను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ఎలాంటి ప్రకటన లేకుండా చేపట్టిన ఈ ఆందోళన వల్ల ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 

Updated Date - 2021-11-25T15:53:24+05:30 IST