Advertisement
Advertisement
Abn logo
Advertisement

కార్మికుల హక్కులను కాలరాస్తే సహించం

కనిగిరి, నవంబరు 28: కార్మికుల హక్కులను కాలరాస్తే సహించేది లేదని ఏఐటీయూసీ రాష్ట్ర ఉపప్రధాన కార్యదర్శి ఎస్‌.వెంకటసుబ్బయ్య అన్నారు. స్థానిక ప్రభుత్వ బాలికల హైస్కూల్‌లో ఆదివారం ఆ సంఘం నియోజకవర్గ ద్వితీయ మహసభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కార్మికులు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న 44 చట్టాలను నాలుగు కోడ్‌లుగా మార్చే చట్టాలను రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతన చట్టాలను అమలు చేయాలన్నారు.  రాష్ట్రంలో స్కీం వర్కర్ల భద్రత కోసం, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం, వారి జీతభత్యాలు కోసం ఏఐటీయూసీ కార్మికుల పక్షాన అహర్నిశలు పోరాటాలు చేసి విజయాలు సాఽఽధించిందన్నారు. తొలుత పట్టణంలోని ఒంగోలు బస్టాండ్‌ వద్ద ఉన్న అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నుంచి మహవేదిక వరకు కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జెండాను ఆర్టీసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షడు సీహెచ్‌ కృష్ణారెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న నగర పంచాయతీ చైర్మన్‌ షేక్‌ అబ్దుల్‌ గఫార్‌ మాట్లాడుతూ కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బీ.సురే్‌షబాబు, పీవీ.చౌదరి, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వై.రవీంద్రబాబు, బీకేఎంయూ జిల్లా అధ్యక్షుడు మౌలాలి, ఏఐటీయూసీ, ప్రజా సంఘాల నాయకులు నాయకులు యాసిన్‌, గుజ్జుల బాలిరెడ్డి, పీసీ కేశవరావు, వజ్రాల సుబ్బారావు, మస్తాన్‌రావు, దాసరి సునీత, జీపీ.రామారావు, జిలాని, మోహన్‌, బృంగి సుబ్రమణ్యం, నాజర్‌వలి అంగన్‌వాడీ కార్యకర్తలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement