గ్రామాల్లో ఫ్యాక్షన్‌ను ప్రోత్సహిస్తే సహించం

ABN , First Publish Date - 2021-01-21T07:46:14+05:30 IST

ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో ఫ్యాక్షన్‌ను ప్రోత్సహించి గొడవలు సృష్టిస్తే సహించేదిలేదని మాజీ ఎ మ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ హె చ్చరించారు.

గ్రామాల్లో ఫ్యాక్షన్‌ను ప్రోత్సహిస్తే సహించం
బాధితులను పరామర్శిస్తున్న మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ


మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల  సూర్యనారాయణ 


బత్తలపల్లి, జనవరి20: ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో ఫ్యాక్షన్‌ను ప్రోత్సహించి గొడవలు సృష్టిస్తే సహించేదిలేదని మాజీ ఎ మ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ హె చ్చరించారు. బుధవారం మండలంలోని వెం కటగారిపల్లి గ్రామంలో ఇటీవల కాలంలో బీ జేపీ కార్యకర్తల పొలాల్లో గొర్రెలు మేపి వా రిపైనే వైసీపీ వర్గీయులు దాడిచేసిన ఘటనలో గాయపడిన వారిని ఆయన పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడు తూ వైసీపీ దాడులకు ఎవ్వరూ భయపడవద్దనీ, తానున్నానంటూ భరోసా కల్పించారు. ప్ర శాంతంగా అన్నదమ్ముల్లా కలిసిమెలసి ఉన్న గ్రామాల్లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామాల్లో వర్గాలవారీగా, కులాలవారీగా చిచ్చులు పెట్టి ఫ్యాక్షన్‌కు తెరలేపుతున్నారన్నారు. దౌర్జన్యంగా రైతుల పొలాల్లో గొర్రెలు మేపి, వారిపైనే దాడులు చేయడం ఏమిటని ఘాటుగా ప్రశ్నించారు. దెబ్బలు తిన్నవారిపైనే పోలీసులు అధికారపార్టీకి తొత్తులుగా మారి కేసులు నమోదు చేయడం ఎంతవరకు సబబన్నారు. అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉ న్నామా అని ప్రశ్నించారు. బాధితులపై కేసులు నమోదు చేయడంపైౖ మానవహక్కుల సం ఘం, హైకోర్టుకు వెళతామని ఆయన పేర్కొన్నారు. అనంతరం రాఘవంపల్లి గ్రామంలో రో డ్డు ప్రమాదంలో మృతిచెందిన రాజశేఖర్‌, అదేగ్రామంలోని మృతిచెందిన క్రిష్ణమూర్తి కుటుంబసభ్యులను పరామర్శించి రూ.20వేలు ఆర్థికసాయం అందించారు. కార్యక్రమంలో బీ జేపీ మండల కన్వీనర్‌ ఆకులేటి వీరనారప్ప, కరణం సూర్యప్రకా్‌షరావు, మందల శ్రీనివాసులు, నరసింహులు, పాళ్యంసతీష్‌, సంజీవరాయుడు, రా మ్మోహన్‌, ముత్యాలు, క్రిష్ణమనాయుడు, ఈశ్వరయ్య, శీనప్ప, మైకు వన్నూరప్ప, చంద్ర పాల్గొన్నారు.


Updated Date - 2021-01-21T07:46:14+05:30 IST