Abn logo
Sep 26 2021 @ 00:45AM

నిర్వాసితులకు అన్యాయం జరిగితే సహించం

ర్యాలీలో పాల్గొన్న ఉక్కు నిర్వాసితులు

గాజువాక, సెప్టెంబరు 25: ఉక్కు నిర్వాసితులకు అన్యాయం జరిగితే సహించేది లేదని ఉక్కు నిర్వాసిత సంఘం నాయకులు జెర్రిపోతుల ముత్యాలు హెచ్చరించారు. పెదగంట్యాడలో శనివారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నిర్వాసిత నిరుద్యోగులకు తక్షణమే ఉపాధి కల్పించాలని, స్టీల్‌ప్లాంట్‌ అన్ని పోస్టులలో 50 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని, ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కట్టా అప్పారావు, అప్పలనాయుడు, సంజీవ్‌, కె.రామారావు, దేవి, లక్ష్మి, వరలక్ష్మి పాల్గొన్నారు.