Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఉక్కు కర్మాగారం జోలికివస్తే సహించం

పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు నీరుకొండ రామచంద్రరావు

కూర్మన్నపాలెం, డిసెంబరు 5: ఉక్కు కర్మాగారం జోలికి వస్తే సహించమని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు నీరుకొండ రామచంద్రరావు అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు నిరసనగా కూర్మన్నపాలెంలో ఉక్కు ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 297వ రోజు కొనసాగాయి. ఆదివారం ఈ దీక్షలలో యుటిలిటీస్‌, ఈఎన్‌ఎండీ, డబ్ల్యూఎండీ, సీఆర్‌ఎంపీ విభాగ కార్మికులు పాల్గొన్నారు. ఈ శిబిరంలో రామచంద్రరావు మాట్లాడుతూ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై లేఖలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్యం చోద్యం చూస్తూ, కాలయాపన చేయటం తగదన్నారు. కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన విభాగాల వారీగా ప్రైవేటీకరణకు శ్రీకారం చుట్టిందని విమర్శించారు. ఇందులోభాగంగానే కోక్‌ఓవెన్‌ బ్యాటరీల ప్రైవేటీకరణకు టెండర్లు పిలవటం జరిగిందన్నారు. ఈ విషయంపై స్థానిక ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ దృష్టికి తీసుకువెళ్లామని, ఆయన స్పందిస్తూ పార్లమెంట్‌లో ఈ విషయం ప్రస్తావిస్తామన్నారని వివరించారు. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ మాట్లాడుతూ ఈ నెల 8 నాటికి ఉక్కు రిలే నిరాహార దీక్షలు 300 రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో గాజువాకలో భారీ ధర్నా చేపట్టనున్నట్టు వెల్లడించారు. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు యు.వెంకటేశ్వర్లు, గంధం వెంకటరావు, కె.సత్యనారాయణ, గంగవరం గోపి, వేములపాటి ప్రసాద్‌, నాగార్జున, నూకరాజు, రమణయ్య, బాలస్వామి, రమణ, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement