పాఠశాలలో రాజకీయాలు చేస్తే సహించం

ABN , First Publish Date - 2022-01-28T06:25:41+05:30 IST

దేవాలయం లాంటి పాఠశాలలో రాజకీయాలు చేస్తే సహించేది లేదని విద్యార్థుల తల్లిదండ్రులు హెచ్చరించారు.

పాఠశాలలో రాజకీయాలు చేస్తే సహించం
ఉపాధ్యాయురాలిని నిలదీస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు

రాయుడుపేట గ్రామస్థుల నిరసన


తుమ్మపాల, జనవరి 27: దేవాలయం లాంటి పాఠశాలలో రాజకీయాలు చేస్తే సహించేది లేదని విద్యార్థుల తల్లిదండ్రులు హెచ్చరించారు. భట్లపూడి పంచాయతీ రాయుడుపేట పాఠశాల వద్ద గురువారం వారు నిరసన కార్యక్రమం చేపట్టారు. పాఠశాలలో రూ.వెయ్యి జీతం నుంచి 15 ఏళ్లుగా ఆయాగా పనిచేస్తున్న రమణమ్మను తొలగించేందుకు స్కూల్‌ కమిటీ సభ్యులు తీర్మానాన్ని రూపొందించడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. కారణం లేకుండా, ఫిర్యాదులు రాకుండా రమణమ్మను తొలగించే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. ఈ అంశంపై విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం అన్యాయమని వాపోయారు. ఇదే పందా కొనసాగితే తమ పిల్లలను పాఠశాలకు పంపించే ప్రసక్తే లేదని. టీసీలను తక్షణమే ఇచ్చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ అంశంపై ఎంఈవో దివాకర్‌ను వివరణ కోరగా, ఏ ఒక్కరి నిర్ణయంతో రమణమ్మను తొలగించడం జరగదని, విచారణ చేపట్టి న్యాయం చేస్తామని చెప్పారు. 

Updated Date - 2022-01-28T06:25:41+05:30 IST