ED సుదీర్ఘ ప్రశ్నావళిని ఎలా ఎదుర్కొన్నాడో చెప్పిన Rahul Ganhdi

ABN , First Publish Date - 2022-06-23T02:40:03+05:30 IST

నేషనల్ హెరాల్డ్ కోసులో ఐదు రోజుల పాటు గంటల తరబడి రాహుల్ గాంధీని సుదీర్ఘంగా..

ED సుదీర్ఘ ప్రశ్నావళిని ఎలా ఎదుర్కొన్నాడో చెప్పిన Rahul Ganhdi

న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కోసులో ఐదు రోజుల పాటు గంటల తరబడి రాహుల్ గాంధీని సుదీర్ఘంగా విచారించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు ఆయన ఏమాత్రం విసుగువిరామం లేకుండా ఎంతో ఓర్పుగా, సహనంగా ఉండటం చూసి ఆశ్చర్యపోయారట. ఈడీ మారథాన్ సెషన్‌ను తాను ఏ విధంగా ఎదుర్కొన్నాననే విషయాన్ని, తన ఓర్పుకు అసలు కారణాన్ని రాహుల్ గాంధీ ఢిల్లీ ప్రధాన కార్యాలయంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ గుర్తుచేసుకున్నారు. 12/12 అడుగుల గదిలో, ముగ్గురు ఈడీ అధికారుల సమక్షంలో తాను కూర్చుని ఉన్నప్పటికీ ఒంటరిగా ఉన్నాననే ఫీలింగ్ ఎప్పుడూ తనకు కలగలేదని చెప్పారు.


''నేను గదిలో ఒంటరిగా ఏమీ లేను. కాంగ్రెస్ కార్యకర్తలంతా నాతో ఉన్నారు. ఫ్రీడం (Freedam) పట్ల నమ్మకం ఉన్న వారంతా నాతోనే ఉన్నారు. అలుపూసొలుపూ లేకుండా 11 గంటల సేపు కుర్చీలో ఎలా కూర్చోగలుగుతున్నారని ఈడీ అధికారులు రాత్రి సమయంలో నన్ను ప్రశ్నించారు. నాకు అసలు నిజం చెప్పకూడదని అనిపించింది. నేను విపాస్సన ధాన్యం చేస్తున్నానని, ఆ ధ్యాన పద్ధతిలో మీరు కూడా గంటల తరబడి కూర్చోవచ్చని చెప్పాను'' అని రాహుల్ తెలిపారు. ఐదు రోజుల పాటు తాను ఈడీ ప్రశ్నావళిని ఎలా ఎదుర్కొన్నానో రాహుల్ చెబుతూ...ప్రశ్నలన్నింటికీ జవాబిచ్చాను. జవాబులన్నీ చెక్ చేసుకున్నాను. కుర్చీని అంతగా విడిచిపెట్టలేదు. మీరు ఇంత ఓపికగా ఎలా ఉన్నారని అధికారులు నన్ను చివరిరోజున ప్రశ్నించారు. నేను చెప్పేదిలేదని వాళ్లతో అన్నాను'' అని రాహుల్ వివరించారు.


అసలు నిజమేమిటో మీకు తెలుసా అని కార్యకర్తలను రాహుల్ ప్రశ్నిస్తూ... ''2004 నుంచి నేను కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నాను. ఎంతో ఓర్పుతోనే ఉన్నాను. పార్టీ నన్ను అసలిపోయేలా చేయలేదు. పైగా ఓర్పును నాకు నేర్పింది. సచిన్ పైలట్‌‌ను చూడండి. అలా మనం కూడా ప్రజల కోసం పోరాడాలి'' అని అన్నారు.

Updated Date - 2022-06-23T02:40:03+05:30 IST