టైటిల్‌ నిలబెట్టుకోవాలని..

ABN , First Publish Date - 2022-01-21T08:53:23+05:30 IST

టోక్యో ఒలింపిక్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరచిన భారత మహిళల హాకీ జట్టు శుక్రవారం నుంచి జరిగే ఆసియా కప్‌లో

టైటిల్‌ నిలబెట్టుకోవాలని..

 ఫేవరెట్‌గా భారత మహిళలు

నేటి నుంచి ఆసియా కప్‌ హాకీ


మస్కట్‌: టోక్యో ఒలింపిక్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరచిన భారత మహిళల హాకీ జట్టు శుక్రవారం నుంచి జరిగే ఆసియా కప్‌లో టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. తొలి మ్యాచ్‌లో మలేసియాతో డిఫెండింగ్‌ చాంప్‌ భారత్‌ తలపడనుంది. కెప్టెన్‌ రాణీ రాంపాల్‌ గాయం కారణంగా దూరం కావడంతో.. గోల్‌ కీపర్‌ సవిత జట్టును నడిపించనుంది. మలేసియాపై గెలుపుతో టోర్నీలో శుభారంభం చేయాలన్న పట్టుదలతో ఉంది. పూల్‌-ఎలో భారత్‌తోపాటు జపాన్‌, మలేసియా, సింగపూర్‌, పూల్‌-బిలో కొరియా, ఇండోనేసియా, థాయ్‌లాండ్‌, చైనా జట్లున్నాయి. పూల్‌లో టాప్‌-2లో నిలిచిన జట్లు ఈనెల 26న జరిగే సెమీ్‌సకు అర్హత సాధిస్తాయి. 28న ఫైనల్‌ జరగనుంది. 


భారత జట్టు మ్యాచ్‌లు..

మలేసియాతో శుక్రవారం రాత్రి 9.30 నుంచి

జపాన్‌తో ఆదివారం రాత్రి 8.30 నుంచి

సింగపూర్‌తో సోమవారం రాత్రి 8.30 నుంచి

Updated Date - 2022-01-21T08:53:23+05:30 IST