Olympics bronze medallist: లవ్లీనాకు సీఎం సత్కారం...

ABN , First Publish Date - 2021-08-12T17:22:13+05:30 IST

అసోం రాష్ట్రానికి గురువారం తిరిగివచ్చిన టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ కు అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఘన స్వాగతం పలికారు.....

Olympics bronze medallist: లవ్లీనాకు సీఎం సత్కారం...

 రూ.50లక్షల నగదు, ప్రభుత్వ ఉద్యోగం

గౌహతి (అసోం):అసోం రాష్ట్రానికి గురువారం తిరిగివచ్చిన టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ కు అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీమంత శంకరదేవ్ కళాక్షేత్రంలో లవ్లీనాను అసోం ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిశ్వ శర్మతో సహా పలువురు ప్రముఖులు ప్రభుత్వం తరపున ఘనంగా సన్మానించారు.లవ్లీనా స్వగ్రామంలోనూ ప్రజలు ఆమెకు స్వాగతం పలకడానికి ఎదురు చూస్తున్నారు. అస్సాం స్పోర్ట్స్ ఇంటిగ్రేటెడ్ పాలసీ కింద ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనాకు రూ .50 లక్షల నగదు బహుమతిని అందించింది. 


దీంతోపాటు లవ్లీనాకు అసోం క్లాస్ 1 ప్రభుత్వ ఉద్యోగం కల్పించనున్నారు. ‘‘మా స్టార్ ఒలింపియన్ పతక విజేత లవ్లీనా బోర్గోహైన్‌ను నేను గర్వంగా స్వాగతించాను. ఒలింపిక్స్‌లో ఆమె విజయంతో ఒక బిలియన్ కలలను రగిల్చింది...ప్రపంచ స్థాయిలో గొప్ప విజయాలు సాధించాలని కోరుకుంటూ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా ప్రతిభను చాటుకోవడానికి ఒక ఉదాహరణగా నిలిచింది’’ అని అసోం ముఖ్యమంత్రి హిమంత బి శర్మ ట్వీట్ చేశారు.

Updated Date - 2021-08-12T17:22:13+05:30 IST