మోదీకి బాచ్‌ కృతజ్ఞతలు

ABN , First Publish Date - 2020-04-03T09:52:39+05:30 IST

టోక్యో ఒలింపిక్స్‌ వాయిదాకు మద్దతు తెలిపిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐవోసీ) అధ్యక్షుడు థామస్‌ బాచ్‌ కృతజ్ఞతలు తెలిపారు...

మోదీకి బాచ్‌ కృతజ్ఞతలు

లుసాన్నే: టోక్యో ఒలింపిక్స్‌ వాయిదాకు మద్దతు తెలిపిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐవోసీ) అధ్యక్షుడు థామస్‌ బాచ్‌ కృతజ్ఞతలు తెలిపారు. కరోనా వైర్‌సను ఎదుర్కోవడంలో ఐవోసీ తీసుకుంటున్న చర్యలను జీ20 నేతల వీడియో కాన్ఫరెన్స్‌లో మోదీ ప్రశంసించారు. టోక్యో క్రీడల వాయిదాకు కూడా మద్దతు ప్రకటించారు. దీనికి కృతజ్ఞతలు తెలుపుతూ బాచ్‌ లేఖ రాశారు. కరోనా వైరస్‌ కారణంగా విశ్వక్రీడలను వచ్చే ఏడాదికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. 

Updated Date - 2020-04-03T09:52:39+05:30 IST