టోక్యో ఒలింపిక్స్ 2020 రద్దు యోచన?

ABN , First Publish Date - 2020-02-26T14:39:10+05:30 IST

మే నెల చివరి నాటికి కొవిడ్-19 నియంత్రణలో లేనట్లయితే టోక్యో ఒలింపిక్స్ 2020ని రద్దు చేస్తామని ....

టోక్యో ఒలింపిక్స్ 2020 రద్దు యోచన?

అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సీనియర్ సభ్యుడు సంచలన వ్యాఖ్యలు 

టోక్యో(జపాన్): చైనాతోపాటు ప్రపంచ దేశాలను వణికిస్తున్న కొవిడ్-19 ప్రభావం త్వరలో జపాన్ దేశంలోని టోక్యో నగరంలో జరగనున్న 2020 ఒలింపిక్స్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తుందా? అంటే అవునంటున్నారు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సీనియర్ సభ్యుడు, కెనడా మాజీ స్విమ్మింగ్ ఛాంపియన్ అయిన డిక్ పౌండ్. మే నెల చివరి నాటికి కొవిడ్-19 నియంత్రణలో లేనట్లయితే టోక్యో ఒలింపిక్స్ 2020ని రద్దు చేస్తామని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సీనియర్ సభ్యుడు డిక్ పౌండ్ వ్యాఖ్యానించారు. కొవిడ్ వ్యాపిస్తున్నందున ఈ వేసవికాలంలో టోక్యోలో ఒలింపిక్స్ నిర్వహించడం చాలా ప్రమాదకరమని రుజువైతే క్రీడలను పూర్తిగా రద్దు చేస్తామని డిక్ పౌండ్ చెప్పారు. ఒలింపిక్స్ వాయిదా వేయడం, లేదా మరో ప్రాంతానికి తరలించడం కంటే పూర్తిగా రద్దు చేసే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.


రెండు నెలల క్రితం చైనాలోని వూహాన్ లో ప్రారంభమైన కొవిడ్ -19 వల్ల 2,715 మంది మరణించిన నేపథ్యంలో దీని ప్రభావం ఒలింపిక్స్ నిర్వహణపై పడింది.ఈ వైరస్ చైనాలోనే కాకుండా  దక్షిణ కొరియా, మధ్య తూర్పు దేశాలు, ఐరోపా ఖండంలో ప్రబలింది. కొవిడ్ వల్ల జపాన్ దేశంలోనే నలుగురు మరణించారు. రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా ఒలింపిక్స్ రద్దు చేశారు. జికా వైరస్ వ్యాప్తి చెందినప్పటికీ బ్రెజిల్ లో రియో గేమ్స్ 2016లో షెడ్యూల్ ప్రకారం సాగింది. కొవిడ్ ప్రబలిన నేపథ్యంలో తాము ఒలింపిక్స్ నిర్వహించాలా లేదా అనే విషయాలపై తాము ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సీనియర్ సభ్యుడు డిక్ పౌండ్ వివరించారు.

Updated Date - 2020-02-26T14:39:10+05:30 IST