నిరుద్యోగులకు టోకరా

ABN , First Publish Date - 2022-05-14T06:00:19+05:30 IST

ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన ముగ్గురిపై బాధితులు శుక్రవారం దువ్వాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నిరుద్యోగులకు టోకరా

రైల్వే, ఎంఈఎస్‌ ఉద్యోగాల పేరిట రూ.లక్షలు వసూలు

పోలీసులను ఆశ్రయించిన బాధితులు

నిందితుల్లో రైల్వే రిటైర్డు ఉద్యోగి, ఎంఈఎస్‌ రిటైర్డు ఉద్యోగి, ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి

కూర్మన్నపాలెం, మే 13: ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన ముగ్గురిపై బాధితులు శుక్రవారం దువ్వాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రైల్వే రిటైర్డు ఉద్యోగి, మిలటరీ ఇంజనీరింగ్‌ సర్వీసు (ఎంఈఎస్‌) రిటైర్డు ఉద్యోగి, ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ముఠాగా ఏర్పడి నిరుద్యోగులకు వల వేశారు. అగనంపూడి, తుని, బెంగళూరు ప్రాంతాలకు చెందిన ఈ ముగ్గురు కలిసి రైల్వే, మిలటరీ ఇంజనీరింగ్‌ సర్వీసుల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నగరంలోని పలు ప్రాంతాలకు చెందిన 30 మంది నుంచి 2019 అక్టోబరులో డబ్బులు వసూలు చేశారు. అప్పటి నుంచి ఉద్యోగాల విషయమై బాధితులు ప్రశ్నిస్తున్నప్పటికీ, కరోనా సాకు చూపి వాయిదాలు వేస్తూ వచ్చారు. ఎంతకీ తమకు ఉద్యోగాలు రాకపోవడంతో మోసపోయామని గ్రహించిన ఏడుగురు బాధితులు...పోలీసులను ఆశ్రయించారు. తాము దఫదఫాలుగా రూ.40 లక్షలు చెల్లించామని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితులలో అగనంపూడి, రాజీవ్‌నగర్‌, తాటిచెట్లపాలెం ప్రాంతాలకు చెందినవారు ఉన్నారు. మిగిలిన 23 మంది బాధితుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. దువ్వాడ సీఐ లక్ష్మి కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Read more