చిన్నారి చేతిలో పేలిన తూటా.. తల్లి మృతి

ABN , First Publish Date - 2021-08-14T01:01:51+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో దారుణం జరిగింది. చిన్న ఏమరపాటు కారణంగా ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఫ్లోరిడాకు చెందిన షామయా లిన్ (21) అనే మహిళ ఓర్లాండ్ ప్రాంతంలో తన కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తోంది. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నాడు. గురువారం రోజు

చిన్నారి చేతిలో పేలిన తూటా.. తల్లి మృతి

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో దారుణం జరిగింది. చిన్న ఏమరపాటు కారణంగా ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఫ్లోరిడాకు చెందిన షామయా లిన్ (21) అనే మహిళ ఓర్లాండ్ ప్రాంతంలో తన కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తోంది. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నాడు. గురువారం రోజు ఆమె తన సహోద్యోగులతో కలిసి వీడియో సమావేశంలో ఉండగానే ఉన్నట్టుండి కుప్పకూలింది. ఈ క్రమంలో షామయా లిన్ సహోద్యోగులు.. పోలీసులకు ఫోన్ చేశారు. షామయా ఇంట్లో తుపాకీ పేలిన శబ్దం వినిపించిందని.. ఆ వెంటనే ఆమె కుప్పకూలిపోయిందని పేర్కొన్నారు. షామయా లిన్ ఇంట్లో ఏం జరిగిందో అర్థం కావడంలేదని.. వెంటనే దీనిపై స్పందించాలని కోరారు.


దీంతో వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తుపాకీ తూటాకు షామయా లిన్ బలైనట్టు గుర్తించారు. ఈ ఘటనపై ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేసిన అధికారులు ఆమె మరణానికి గల కారణాలను వెల్లడించారు. భర్తకు సంబంధించిన లోడ్ చేసిన తుపాకీని జాగ్రత్తగా భద్రపోర్చకపోవడం వల్ల.. షామయా లిన్ మృత్యువాతపడ్డట్టు పేర్కొన్నారు. ఆమె పిల్లల్లో ఒకరు తుపాకీని ఆట వస్తువుగా భావించి.. ఆడుకుంటుండగా ఒక్కసారిగా అది పేలిందని వెల్లడించారు. షామయా లిన్‌కు తూటా తగలడంతో అక్కడికక్కడే ఆమె ప్రాణాలు కోల్పోయినట్టు వివరించారు. అంతేకాకుండా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు తుపాకులను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని.. లేదంటే భారీ మూల్యం తప్పదని పోలీసులు హెచ్చరించారు. 


Updated Date - 2021-08-14T01:01:51+05:30 IST