Abn logo
Apr 17 2021 @ 00:50AM

నేడే తిరుపతి ఉప పోరు

ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్‌

3 నియోజకవర్గాల్లో 1056 పోలింగ్‌ కేంద్రాలు

బరిలో 28 మంది అభ్యర్థులు

మే 12న ఫలితాలు


చిత్తూరు, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి నేడు జరగనున్న ఉప ఎన్నికకు సంబంధించిన అన్నిరకాల ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం సిద్ధం చేసింది. 28 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నెల్లూరు జిల్లా పరిధిలో నాలుగు అసెంబ్లీ నియోజకర్గాలుండగా, చిత్తరు జిల్లా పరిధిలోని తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లో 1056 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ మూడు నియోజకవర్గాల్లో 7,40,607 మంది మంది ఓటర్లు ఉన్నారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. చివరి గంటసేపు, అంటే సాయంత్రం 6 నుంచి కొవిడ్‌ పాజిటివ్‌ బాధితులు ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు అవకాశం కల్పించారు. 377 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించగా.. అక్కడ ప్రత్యేక బధ్రతా ఏర్పాట్లను చేశారు. మే 2వ తేదీన ఈ ఓట్లను లెక్కించి ఫలితాలను విడుదల చేస్తారు.


నియోజకవర్గాల వారీగా ఓటర్ల వివరాలు

నియోజకవర్గం ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలు అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్‌

తిరుపతి 2,81,676 382 చంద్రమౌళీశ్వరెడ్డి (తిరుపతి

కార్పొరేషన్‌ డిప్యూటి కమిషనర్‌)

శ్రీకాళహస్తి 2,47,009 362 శ్రీనివాసులు (స్పెషల్‌ డిప్యూటి

కలెక్టర్‌, జీఎన్‌ఎ్‌సఎస్‌, తిరుపతి)

సత్యవేడు 2,10,395 312 చంద్రశేఖర్‌ (డ్వామా పీడీ, చిత్తూరు)

మొత్తం 7,40,607 1056


ఎన్నికల అధికారుల వివరాలు:

- మొత్తం పోలింగ్‌ సిబ్బంది: 5054

- పీవోలు: 1266

- ఏపీవోలు: 1266

- ఓపీవోలు: 2522

- మైక్రో అబ్జర్వర్లు: 451

- సెక్టోరల్‌ ఆఫీసర్‌లు: 111

- రూట్‌ ఆఫీసర్‌లు: 111


- మొత్తం పోలీసు సిబ్బంది: 2913

- అదనపు ఎస్పీలు: 10

- డీఎస్పీలు: 27

- సీఐలు: 66

- ఎస్‌ఐలు: 169

- వీళ్లతో పాటు పెద్దఎత్తున ఏఎ్‌సఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, సివిల్‌, ఎస్టీఎఫ్‌ కానిస్టేబుళ్లు, హోమ్‌గార్డులలను నియమించారు.


తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో

 పోలింగ్‌ కేంద్రాలు: 2470 

సమస్యాత్మక కేంద్రాలు: 877 

వెబ్‌ క్యాస్టింగ్‌,: 1241 కేంద్రాల్లో

వీడియో చిత్రీకరణ :  475 కేంద్రాల్లో 

 మైక్రో అబ్జర్వర్లు: 816 మంది 

జనరల్‌ అబ్జర్వర్‌: దినేష్‌ పాటిల్‌ ఐఏఎస్‌

పోలీస్‌ అబ్జర్వర్‌: రాజీవ్‌కుమార్‌ ఐఏఎస్‌

వ్యయ పరిశీలకుడు: అనిల్‌కుమార్‌, ఐఏఎస్‌


Advertisement
Advertisement
Advertisement