పాతపట్నం: పాతపట్నం, మెళియాపుట్టిలలో ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని ట్రాన్స్‌కో ఏఈ జి.లక్ష్మీనారాయణ తెలిపారు. రోడ్ విస్తరణ పనుల్లో భాగంగా పాతపట్నంలో విద్యుత్ స్తంభాల మార్పిడి చేపడుతున్నందున ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ నిలుపుదల చేస్తున్నామన్నారు. అలాగే జగనన్న ఇళ్ల కాలనీలకు సంబంధించిన ప్రదేశాల్లో విద్యుత్ స్తంభాలు ఏర్పాటుచేయనున్నందున మెళియాపుట్టి మండలంలో ఉదయం 11 నుంచి సాయం త్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు గమనించి సహకరించాలని ఆయన కోరారు.