నేడు భారత్‌ బంద్‌.. అంతా సన్నద్ధం!

ABN , First Publish Date - 2021-02-26T06:58:58+05:30 IST

డీజిల్‌ ధరలు పెరుగుదల, థర్డ్‌ పార్టీ ఇన్స్యూరెన్స్‌ భారం, వేబిల్లుల వేధింపులు, గడువు ముగిసినా టోల్‌ ప్లాజాలు తొలగించకపోవడం తదితర అంశాలపై అఖిలభారత లారీ ఓనర్స్‌ అసోసియేషన్లు ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం తలపెట్టిన భారత్‌ బంద్‌లో జిల్లావ్యాప్తంగా లక్షా 30 వేల లారీలు (గూడ్స్‌ వెహికల్స్‌) నిలిపి వేయనున్నారు.

నేడు భారత్‌ బంద్‌.. అంతా సన్నద్ధం!

డెయిరీఫారమ్‌ సెంటర్‌(కాకినాడ) ఫిబ్రవరి, 25: డీజిల్‌ ధరలు పెరుగుదల, థర్డ్‌ పార్టీ ఇన్స్యూరెన్స్‌ భారం, వేబిల్లుల వేధింపులు, గడువు ముగిసినా టోల్‌ ప్లాజాలు తొలగించకపోవడం తదితర అంశాలపై అఖిలభారత లారీ ఓనర్స్‌ అసోసియేషన్లు ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం తలపెట్టిన భారత్‌ బంద్‌లో జిల్లావ్యాప్తంగా లక్షా 30 వేల లారీలు (గూడ్స్‌ వెహికల్స్‌) నిలిపి వేయనున్నారు. అలాగే విశాఖ ఉక్కును పరిరక్షించాలని కోరుతూ కూడా కేంద్ర కార్మిక సంఘాలు భారత్‌ బంద్‌లో పాల్గొననున్నాయి. అలాగే కార్పొరేట్‌లకు కొమ్ముకాస్తున్న వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని వ్యవసాయ సంఘాలు, జీఎస్‌టీలో లోపాలు సవరించాలని వ్యాపార సంఘాలు భారత్‌ బంద్‌లో భాగస్వామ్యం కానున్నాయి. 

Updated Date - 2021-02-26T06:58:58+05:30 IST