నేడు లక్ష శిబిరాల్లో మెగా వ్యాక్సినేషన్‌

ABN , First Publish Date - 2022-05-08T13:11:55+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం లక్ష ప్రత్యేక శిబిరాల్లో కరోనా టీకా వేయనున్నారు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కరోనా కేసులు అధికమవుతుండగా, వచ్చే నెల (జూన్‌)లో కరోనా నాలుగవ అల

నేడు లక్ష శిబిరాల్లో మెగా వ్యాక్సినేషన్‌

పెరంబూర్‌(చెన్నై): రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం లక్ష ప్రత్యేక శిబిరాల్లో కరోనా టీకా వేయనున్నారు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కరోనా కేసులు అధికమవుతుండగా, వచ్చే నెల (జూన్‌)లో కరోనా నాలుగవ అల వచ్చే అవకాశముందని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. కరోనా వ్యాప్తిని అడ్డుకొనేలా టీకా ప్రక్రియ వేగవంతం చేయాలని కేంద్రప్రభుత్వం రాష్ట్రప్రభుత్వాలకు సూచించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు మొదటి డోస్‌ కూడా వేయించుకోని వారు 50 లక్షల మంది ఉండగా, మొదటి డోస్‌ వేయించుకొని నిర్ణీత కాలంలో రెండవ డోస్‌ వేసుకోని వారి సంఖ్య 1.48 లక్షలుగా ఉంది. అలాగే, రెండవ డోస్‌ వేసుకొని 9 నెలలు గడిచిన 60 ఏళ్ల పైబడిన సుమారు 2 కోట్ల మందికి బూస్టర్‌ డోస్‌ వేయాల్సి ఉంది. వీరందరికీ ఒకేరోజు టీకా వేసేలా ఆదివారం లక్ష ప్రాంతాల్లో మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ చేపట్టనున్నారు. ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ శిబిరాల్లో టీకాలు వేయనున్నారు. ఈ విషయమై ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం మాట్లాడుతూ, రెండు కోట్ల మందికి టీకాలు వేయాలనే లక్ష్యంతో ఈ మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ చేపట్టామన్నారు. ఇంత పెద్ద స్థాయిలో శిబిరాలు నిర్వహించడం దేశంలోనే ప్రథమమని తెలిపారు. టీకా వేయించుకోని వారి పేర్లు, వివరాలు వెబ్‌సైట్‌లో విడుదల చేశామని, వాటి ప్రకారం ఆరోగ్య సిబ్బంది వలంటీర్లు ఇంటింటికి వెళ్లి టీకాలు వేస్తారని మంత్రి  తెలిపారు. 

Read more