నేడు విజయదశమి... కిటకిటలాడనున్న ఆలయాలు

ABN , First Publish Date - 2021-10-15T06:40:22+05:30 IST

హిందువుల ప్రధాన పండుగల్లో ఒకటైన విజయదశమిని శుక్రవారం ఘనంగా జరుపుకునేం దుకు జిల్లా వాసులు సిద్ధమయ్యారు.

నేడు విజయదశమి... కిటకిటలాడనున్న ఆలయాలు
పాతూరులో పండుగ సామాగ్రి కొనేందుకు కిక్కిరిసిన జనం


అనంతపురం టౌన, అక్టోబరు 14 : హిందువుల ప్రధాన పండుగల్లో ఒకటైన విజయదశమిని శుక్రవారం ఘనంగా జరుపుకునేం దుకు జిల్లా వాసులు సిద్ధమయ్యారు. అమ్మవారి ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడనున్నాయి ఆశ్వీయుజ శుద్ధపాడ్యమిని పురస్కరించుకుని ఈ నెల 7వ తేదీ నుంచి గురువారం మహర్నవమి వరకు జిల్లాలోని ఆలయాల్లో రోజు కొక అలంకారంలో అమ్మవారికి ఘనంగా పూజలు నిర్వహించారు. ఆనవాయితీ ప్రకారం శుక్రవారం దసరా పండుగును జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.  విజయదశమిని పురస్కరించుకుని గురువారం పండుగ సరుకుల కొనుగోళ్లు, ప్రజల షాపింగ్‌లతో నగరమంతా కిటకిటలాడింది. పూలు, పండ్లు, మామిడాకులు, టెంకాయలు, అరటి పిలకలు తదితర సామాగ్రి కోనుగోళ్ల నేపథ్యంలో పాతూరులోని రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. కాగా గురువారం ఉదయం ఆయుధపూజ సందర్భంగా వాహనాలు, యంత్రాలతో పాటు వ్యవసాయ పరికరాలకూ పూజలు నిర్వహించారు. విజయదశమి నేపథ్యంలో శుక్రవారం ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడనున్నాయి.


Updated Date - 2021-10-15T06:40:22+05:30 IST