Abn logo
Oct 28 2021 @ 23:06PM

నేడు ఐటీఐ మూడో విడత కౌన్సెలింగ్‌

ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిన వారికి సీట్లు కేటాయింపు

విశాఖపట్నం, అక్టోబరు 28: జిల్లాలోని ప్రభుత్వ ఐటీఐల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఆయా ఐటీఐల్లో  శుక్రవారం మూడో విడత కౌన్సెలింగ్‌ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు  జిల్లా ఐటీఐల కన్వీనర్‌, కంచరపాలెం ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్‌ జె.శ్రీకాంత్‌ తెలిపారు. దరఖాస్తుదారుల ధ్రువపత్రాల పరిశీలన ఇప్పటికే పూర్తయ్యిందని. ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసుకున్న వారిని మాత్రమే కౌన్సెలింగ్‌కు అనుమతిస్తామని తెలిపారు.  సీటు పొందగోరు ఐటీఐకి మాత్రమే అభ్యర్థి కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని సూచించారు. శనివారం ప్రైవేటు ఐటీఐల్లో సీట్లకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని తెలిపారు.