ప్రగతిలో పరుగులు

ABN , First Publish Date - 2020-06-02T10:50:19+05:30 IST

రాష్ట్రం ఏర్పడిన ఆరేళ్లలో జిల్లా పలు రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. రైతుల నుంచి వృద్ధుల వరకు, బీడీ కార్మికుల నుంచి

ప్రగతిలో పరుగులు

రాష్ట్రం ఏర్పడిన ఆరేళ్లలో జిల్లాలో మెరుగైన అభివృద్ధి

వ్యవసాయ, సాగునీటి రంగాల్లో విప్లవాత్మక మార్పులు

విద్య, వైద్యానికి ఊతం

కొత్త పంచాయతీలు, మండలాల ద్వారా పారదర్శకమైన పాలన

నేడు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం


నిజామాబాద్‌, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : రాష్ట్రం ఏర్పడిన ఆరేళ్లలో జిల్లా పలు రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. రైతుల నుంచి వృద్ధుల వరకు, బీడీ కార్మికుల నుంచి కొత్తగా పెళ్లి చేసుకున్న వారికి ప్రభుత్వ ఆసరాతో పా టు సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. జిల్లాలో చెరువుల నుంచి ప్రాజెక్టుల వరకు పనులు ఊపందుకున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితాలు కనిపిస్తుండగా.. ధాన్యం సిరులై రైతుల ఇళ్లలో సాక్షాత్కరిస్తోంది. గ్రామాల నుంచి మున్సిపాలిటీల వరకు నేరుగా నిధులు అందడంతో ఆరేళ్లలో కొన్ని మినహా మెజారిటీ పనులు కొనసాగుతున్నాయి. వ్యవసాయ అనుబంధ రంగాలలో మెరుగు పడుతోంది. సాగునీటి రంగం అభివృద్ధి చెందుతోంది. ఎత్తిపోతల పథకాల ద్వారా బీడు భూములు సస్యశ్యామలమవుతున్నాయి. రాష్ట్రం ఏర్ప డి నేటితో ఆరేళ్లు పూర్తవుతున్న సందర్భంగా జిల్లాలో జరిగి న అభివృద్ధిపై ‘ఆంధ్రజ్యోతి’  ప్రత్యేక కథనం.


కొత్త మండలాలు, పంచాయతీలు..

రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలనాపరంగా సంక్షేమ పథకా లు అందించేందుకు కొత్త గ్రామ పంచాయతీలు, మండలా లు, రెవెన్యూ డివిజన్‌లు ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాను విడదీసి కొత్తగా కామారెడ్డి జిల్లా ఏర్పాటు చేశారు. పాలనపరంగా తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశా రు. ఆర్మూర్‌ రెవెన్యూ డివిజన్‌ను కొత్తగా ఏర్పాటు చేసి ఆ  ప్రాంత ప్రజల కోర్కెను తీర్చారు. భీమ్‌గల్‌ను మున్సిపాలిటీ గా ఏర్పాటు చేయడంతో త్వరగా అభివృద్ధి చెందే అవకాశం ఏర్పడింది. నగర అభివృద్ధి కోసం నుడా ఏర్పాటు చేసి శివా రు గ్రామాలను మున్సిపల్‌ కార్పొరేషన్‌లో కలపడం వల్ల భ వన నిర్మాణ రంగం ఊపందుకుంది. గ్రామాల్లో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. పాలనను మరింత మెరుగ్గా అందించేందుకు కొత్త కలెక్టరేట్‌ నిర్మాణం పూర్తవుతోంది. త్వరలోనే అన్ని శాఖలు ఒకేదగ్గరకు వచ్చి పాలన మరింత ప్రజలకు చేరువయ్యే అవకాశం ఏర్పడనుంది.


వ్యవసాయ రంగానికి ఊతం..

రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం చేపట్టిన పలు పథకాల వల్ల వ్యవసాయ రంగం మెరుగవుతోంది. రుణమాఫీ, రైతుబంధు అమలు వల్ల రైతులు అ ప్పుల ఊబినుంచి బయటపడుతున్నారు. రైతు బంధువల్ల సన్న, చిన్నకారు రైతుకు రెండు పం టలకు పెట్టుబడికి ఇబ్బంది లేకుండా నిధులు అందుతున్నాయి. రైతు బీమా ప్రవేశ పెట్టడం వల్ల జిల్లాలో ప్రమాదవశాత్తు చనిపోయిన రైతు కుటుంబానికి 5లక్షల బీమా అందుతోం ది. సబ్సిడీపై ట్రాక్టరు, ఇతర యంత్రాలు జి ల్లాలోని రైతులకు అందాయి. పంట రుణాలు మాఫీ వల్ల రైతులకు ఊరట లభించింది. పం డించిన ధాన్యం, మొక్కజొన్న, కంది, శనగలు ప్రభుత్వమే కొనుగోలు చేయడం వల్ల రై తులకు ఉపయోగపడింది. పసుపు రైతులకు సరైన ఏర్పా ట్లు చేస్తే మరింత లబ్ధిచేకూరే అవకాశం ఉంది. 


విద్యకు ప్రాధాన్యం..

కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాలో విద్యకు ప్రాధాన్య మిస్తున్నారు. దశలవారీగా పాఠశాలల్లో ఇంగ్లిష్‌ బోధన ప్రవేశపెట్టారు. కొత్తగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అను బంధంగా రుద్రూరులో ఫుడ్‌సైన్స్‌ కళాశాలను నెలకొల్పారు. దీనివల్ల జిల్లా విద్యార్థులకు మేలు జరుగుతోంది.  


వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి..

రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాలో వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిని వైద్యకళాశాలకు అ నుబంధంగా చేసి జనరల్‌ ఆసుపత్రిగా మార్చారు. పడకల ను పెంచారు. మౌలిక వసతులు కల్పించారు. మెడికల్‌ కళాశాల స్టాఫ్‌ను, కోర్సుల ను పెంచడం వల్ల రోగులకు ఎక్కువగా సేవలు అందుతున్నాయి. బోధన్‌ ఏరియా ఆసుప త్రిని జిల్లా కేంద్ర ఆసుపత్రిగా మార్చగా, ఆర్మూర్‌ ఆసుపత్రిలో పడకల సంఖ్యను పెంచారు. కేసీఆర్‌ కిట్‌ ప్రవేశపెట్టడం వల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీల సంఖ్య పెరిగింది. క రోనా నేపథ్యంలో ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో అందిన సేవల వల్ల ప్రజలకు నమ్మకం పెరుగుతోంది.


వృద్ధులు, వితంతులకు ఆసరా..

కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత వృద్ధులు, వితంతువులు, బీడీ, చేనేత, గీత కార్మికులు, దివ్యాంగులలో భరోసా పెరిగిం ది. వీరికి నెలనెలా అందిస్తున్న ఆసరా పింఛన్లను ఎంతగా నో ఉపయోగపడుతున్నాయి. ప్రతినెలా జిల్లాలో 2.60 లక్షల మందికి ఆసరా పింఛన్లు అందివ్వడం వల్ల వారిలో భరోసా పెరిగింది. 


సంక్షేమ పథకాలలో ముందడుగు..

ఈ ఆరేళ్లలో సంక్షేమ పథకాల అమలులో జిల్లా ముం దుంది.  బీసీ, ఎస్సీ, ఎస్టీ, నిరుద్యోగులకు ఇస్తున్న రుణాలతో వారు స్వయం ఉపాధిపై బతికే అవకాశం ఏర్పడింది. రూ. 50 వేలు ఒకే విడతలో ఇవ్వడం వల్ల లబ్ధిచేకూరుతోంది. ఆడ పిల్లల పెళ్లిళ్ల కోసం ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్‌ పథకాలు పేద కుటుంబాల వారి కి ఉపయోగపడుతున్నాయి. గొర్రెల పంపిణీ పథకం వారికి ఎంతో లబ్ధిచేకూర్చింది. జిల్లా లో ఇప్పటి వరకు 10 వేల మంది లబ్ధిదారులకు గొర్రెలను అందించారు. దీం తో ఆ కుటుంబాలకు లక్ష ల ఆదాయం వచ్చింది. మత్స్యకారుల లబ్ధి కోసం ఉచితంగా చేప పిల్లల పంపిణీ తో పాటు యంత్రాల ను అందిం చారు. వారు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం చే యూతనిచ్చింది. గీత, చే నేత పనివారలకు పలు పథకాలను ప్రవేశపెట్టి అ మలుచేస్తున్నారు. ఎస్సీ కా ర్పొరేషన్‌ ద్వారా కొంత మందికి భూములను కూడా అందించారు. భూపంపిణీ కింద చేయూతనిచ్చారు. డబుల్‌  బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం చేపట్టి పేదలకు అందించే ఏర్పాట్లను చేస్తున్నారు. 


మెరుగైన రహదారులు..

ఈ ఆరేళ్లలో జిల్లాలో గ్రామీ ణ, పట్టణ ప్రాంతాల్లో రోడ్ల ను మెరుగుపరుస్తున్నారు. కోట్ల రూపాయల నిధుల ను తెచ్చి పంచాయతీరాజ్‌, రోడ్లు భవనాల శాఖ ద్వారా పనులు చేస్తున్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ రహదారులను మెరుగు ప రుస్తున్నారు. ఈ నిధులే కాకుండా ఉపాధి హామీ నిధులను కూడా వెచ్చించి ఈ పనులను చేస్తున్నా రు. రెండేళ్లలో అన్ని గ్రామాలకు పూర్తి నెట్‌వర్క్‌ కల్పిం చే విధంగా ఏర్పాట్లు చే స్తున్నారు. మున్సిపాలిటీల్లో వా ర్డుల వారీగా రోడ్లను వేస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఆరేళ్లలో రోడ్ల కోసం భారీ నిధులను విడుదల చేశారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లోనూ సుమారు రూ.100కోట్ల వరకు రోడ్ల కోసం వినియోగిస్తున్నారు. సుమారు వెయ్యి కోట్లకుపైగా గ్రామీణప్రాంత రోడ్లకు వెచ్చిస్తున్నారు. 


పుష్కలంగా సాగు నీరు..

జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు ఊతం లభించింది. ఆరే ళ్లలో కోట్లాది రూపాయల నిధులు జిల్లాకు వచ్చాయి. మిష న్‌ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించడం వల్ల భూగర్భజలాలు పెరిగాయి. రూ.1,070 కోట్లతో చేపట్టిన ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం జిల్లా రైతులకు ఈ సీజన్‌లో ఉపయోగపడనుంది. ఇప్పటికే ట్రయల్‌రన్‌ పూర్తి కావడం వల్ల ఈ సీజన్‌లోనే ఎస్సారెస్పీకి నీటిని ఎత్తిపోయనున్నారు. జిల్లాలో చేపట్టిన కాళేశ్వరం ప్యాకేజీ 20, 21 పనులు కొలిక్కి వస్తున్నాయి. ప్యాకేజీ 20 ద్వారా ఈ సీజన్‌లో సాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పైప్‌లైన్‌ల నిర్మాణం చేస్తున్నారు. మంచిప్ప పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నా రు. ఈ ప్రాజెక్టు ద్వారా జిల్లాలో రెండు లక్షల ఎకరాల వర కు నీరందనుంది. నిజాంసాగర్‌ పనుల ఆధునికీకరణ పను లు చేశారు. గుత్ప, అలీ సాగర్‌ ఎత్తిపోతలకు నీళ్లు అందిస్తున్నారు.


తప్పని ఎదురు చూపులు 

జిల్లాలో ఆరేళ్లలో ఎన్నో అభివృద్ధిపనులు జరిగినా.. ఇంకా కొన్ని మిగిలే ఉన్నాయి. జిల్లా ప్రజల చిరకాల కోరికలు తీరకుండా ఉన్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోధ న్‌ షుగర్‌ ఫ్యాక్టరీ మళ్లీ తెరుచుకుంటుందని అందరూ భావించినా ఇప్పటి వరకు దానిపైన దృష్టిపెట్టలేదు. నిజామాబాద్‌ కో ఆపరేటివ్‌ షుగర్‌ ఫ్యాక్టరీ కూ డా మూతపడే ఉంది. పసుపు రైతులు బోర్డు కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు. కేంద్రం ముందుకు రాకపోవడం వల్ల ఏర్పాటు కావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం వేల్పూర్‌ మండలం పచ్చలనడ్కుడలో పసుపు పార్కును ఏర్పాటు చేసినా ఇంకా పనులు పూర్తికాలేదు. జిల్లాలోని విద్యార్థులు బీటెక్‌, ఫార్మసీ కళాశాలలు ఏర్పా టు చేయాలని కోరుతున్నారు. అలాగే జిల్లా కేంద్రంలో అందరికీ ఉప యోగపడే స్టేడియం ఏర్పాటు చేయాలని క్రీడాకారులు గత కొన్నేళ్లుగా విజ్ఞప్తి చేస్తున్నారు. భూకేటాయింపులు జరిగినా ఇంకా మంజూరు కాలేదు. 


Updated Date - 2020-06-02T10:50:19+05:30 IST