నేడు జిల్లావ్యాప్తంగా రెండో డోస్‌ వ్యాక్సినేషన్‌

ABN , First Publish Date - 2021-05-08T07:04:17+05:30 IST

జిల్లా వ్యాప్తంగా శనివారం కోవిషీల్డ్‌, కోవాగ్జిన్‌ రెండో డోస్‌ టీకా వేయనున్నట్లు కలెక్టర్‌ హరినారాయణన్‌ తెలిపారు.

నేడు జిల్లావ్యాప్తంగా రెండో డోస్‌ వ్యాక్సినేషన్‌

చిత్తూరు కలెక్టరేట్‌, మే 7: జిల్లా వ్యాప్తంగా శనివారం కోవిషీల్డ్‌, కోవాగ్జిన్‌ రెండో డోస్‌ టీకా వేయనున్నట్లు కలెక్టర్‌ హరినారాయణన్‌ తెలిపారు. 100 గ్రామీణ, 27 అర్బన్‌ పీహెచ్‌సీల్లో కోవిషీల్డ్‌, 31 పీహెచ్‌సీల్లో కోవాగ్జిన్‌ టీకా వేయడం జరుగుతుందని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఇందుకోసం 20వేల కోవిషీల్డ్‌, ఆరువేల కోవాగ్జిన్‌ డోసులను వినియోగించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. 


ఈ వ్యాక్సిన్‌ ఏ మూలకు ?


కరోనా కట్టడికి వ్యాక్సినేషనే మార్గమని చెబుతున్న ప్రభుత్వం.. సకాలంలో రెండో డోసు టీకాలు అందించలేకపోతోంది. జిల్లాలో ఇప్పటి వరకు కొవిషీల్డ్‌ 429931 మంది, కొవాగ్జిన్‌ 82814 మంది చొప్పున 593723 మంది మొదటి డోసు వ్యాక్సిన్‌ వేసుకున్నారు. రెండో డోస్‌ కోసం 3,33,580 మంది ఎదురు చూస్తున్నారు. వీరిలో 3,35,480 మందికి కొవిషీల్డ్‌, 62967 మందికి కొవాగ్జిన్‌ అవసరం. కానీ, శనివారం 20 వేల డోసుల కొవిషీల్డ్‌, ఆరు వేల డోసుల కొవాగ్జిన్‌ మాత్రమే వచ్చింది. ఇప్పటి అవసరాలకు ఈ వ్యాక్సిన్‌ ఏ మూలకూ సరిపోని పరిస్థితి. తమ పరిస్థితి ఏంటని మిగిలిన వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కాగా, శనివారం వ్యాక్సిన్‌ వేయడానికి జిల్లాలో 127 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. 

Updated Date - 2021-05-08T07:04:17+05:30 IST