నేడు కలెక్టర్‌ సూర్యకుమారి రాక

ABN , First Publish Date - 2021-07-30T04:58:58+05:30 IST

నూతన కలెక్టర్‌ సూర్యకుమారి శుక్రవారం బాధ్యతలు చేపట్టనున్నారు. పనిచేసిన మహిళా కలెక్టర్లలో సూర్యకుమారి రెండో వ్యక్తి కానున్నారు. జిల్లా ఆవిర్భావం తరువాత ఇప్పటివరకూ 26 మంది కలెక్టర్లు పనిచేశారు. వారిలో 15వ కలెక్టర్‌గా 1997 నుంచి 1999 మధ్య కాలంలో పూనం మాలకొండయ్య పనిచేశారు.

నేడు కలెక్టర్‌ సూర్యకుమారి రాక

జిల్లా రెండో మహిళా కలెక్టర్‌గా బాధ్యతలు 

కలెక్టరేట్‌,  జూలై 29: నూతన కలెక్టర్‌ సూర్యకుమారి శుక్రవారం బాధ్యతలు చేపట్టనున్నారు. పనిచేసిన మహిళా కలెక్టర్లలో సూర్యకుమారి రెండో వ్యక్తి కానున్నారు. జిల్లా ఆవిర్భావం తరువాత ఇప్పటివరకూ 26 మంది కలెక్టర్లు పనిచేశారు. వారిలో 15వ కలెక్టర్‌గా 1997 నుంచి 1999 మధ్య కాలంలో పూనం మాలకొండయ్య పనిచేశారు. ఆమె తర్వాత 27వ కలెక్టర్‌గా మళ్లీ మహిళ వస్తున్నారు. కొత్త కలెక్టర్‌ సూర్యకుమారి శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆమె 2019 డిసెంబరు 30న సివిల్‌ సప్లయ్స్‌ ఎమ్‌డీ హోదాలో జిల్లాకు వచ్చారు. ధాన్యం సేకరణపై సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పుడు కలెక్టర్‌ హోదాలో వస్తున్నారు. 

నోటు పుస్తకాలు ఇవ్వండి చాలు

కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత తనను కలిసి శుభాకాంక్షులు తెలిపేందుకు వచ్చే అధికారులు, అనధికారులు, ఇతరులు  పూల దండలు తీసుకురావద్దని ఎ.సూర్యకుమారి సూచిస్తున్నారు. వాటికి బదులుగా పేద విద్యార్థులకు ఉపయోగపడే నోటు పుస్తకాలు ఇవ్వాలని అధికారులకు సమాచారం ఇచ్చారు. పుష్పగుచ్ఛాల కోసం ఖర్చు చేసే డబ్బులు వృథా అని, నోటు పుస్తకాలైతే విద్యార్థులకు ఉపయోగపడతాయని చెప్పారు.


Updated Date - 2021-07-30T04:58:58+05:30 IST