Abn logo
Apr 13 2021 @ 00:35AM

నేడు ప్లవనామ సంవత్సరాది

కరోనా నిబంధనలు మరచి ఉగాది సందర్భంగా పాతూరులో పండుగ సామగ్రి కొనుగోళ్లలో ప్రజలు

పండుగ సామగ్రి కొనుగోళ్లలో ప్రజలు బిజీబిజీ

అనంతపురం టౌన, ఏప్రిల్‌ 12: చాంద్రమానం ప్రకారం ఏటా చైత్రశుద్ధ పాడ్యమినాడు ప్రజలు ఉగాది పండుగ చేసుకుంటారు. పండుగల్లో ఆదిగా వచ్చేది, ప్రకృతి తో ముడిపడిఉన్న పండుగ ఇది. షడ్రుచుల సమ్మిళితమైన ఉగాది పచ్చడి ఈ పండుగ విశేషం. మంగళవారం అరవై తెలుగు సంవత్సరాల్లోని ప్లవనామ సంవత్సర ఉగాది ఉత్సవాలను జరుపుకునేందుకు జిల్లావ్యాప్తంగా వున్న దేవాలయాలన్నీ ఇప్పటికే సిద్ధమ య్యాయి. జిల్లాకేంద్రంలో ప్రధానంగా ఆర్‌ఎఫ్‌ రోడ్డులోని లక్ష్మీవెంక టేశ్వరాలయం, పాతూరు చెన్నకేశవస్వామి ఆలయం, మొదటిరోడ్డు కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయం, కొత్తూరు వాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయాల్లో విశేష వేడుకలను నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా కరోనా వైరస్‌ ప్రబలుతున్న నేపథ్యంలో ఆలయాల్లో పంచాంగ శ్రవణాలు, సామూహిక పూజలను రద్దు చేసినట్లు ఆయా ఆలయాల నిర్వాహకులు పేర్కొన్నారు. 

కిటకిటలాడిన మార్కెట్లు... కానరాని కొవిడ్‌ నిబంధనలు

ప్లవనామ సంవత్సర ఉగాది పండుగను ఘనంగా జరుపుకోడానికి జిల్లా ప్రజలు సమాయత్త మయ్యారు. ఈనేపథ్యంలో సోమవారం జిల్లాకేంద్రంతో పాటు ప్రధాన నగరా ల్లోని మార్కెట్లు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. వేపపూత, మామిడాకులు, పండ్లు, కూరగాయలు, పూజా సామగ్రిని కొనుగోలు చేసేందుకు వచ్చిన ప్రజలతో మార్కెట్లన్నీ సందడిగా వరాయి. ముందస్తు అడ్వాన్సులు సైతం చెల్లించేందుకు నగరవాసులు ఓళిగసెంటర్లబాట పడుతున్నారు. అయితే కొనుగోళ్ల సందడిలో పడి ప్రజలు కొవిడ్‌ నిబంధనలను గాలికొదిలేశారు. పాతూరు, నడిమివంక, క్లాక్‌టవర్‌ తదితర ప్రాంతాల్లో పండుగ సామగ్రిని కొనుగోలు చేసే క్రమంలో ప్రజలు భౌతికదూ రం నిబంధనను పాటించకుండా గుంపులుగుంపులుగా కలిసి, తిరగసాగారు. కొందరైతే మా స్కులు కూడా ధరించలేదు.


Advertisement
Advertisement
Advertisement