నాన్నకు ఆర్థిక కానుక

ABN , First Publish Date - 2021-06-20T09:35:59+05:30 IST

మీ జీవితానికి సుస్థిర బాట వేసిన మీ నాన్నకు భరోసా కల్పించాలనుకుంటున్నారా..? ఫాదర్స్‌ డే నాడు మీ తండ్రి భవిష్యత్‌ అవసరాలను తీర్చగలిగే ఆర్థిక బహుమతి అందించండి. అందుకు ఉన్న అవకాశాలు మీ కోసం..

నాన్నకు ఆర్థిక కానుక

నేడు ఫాదర్స్‌ డే

మీ తండ్రికి భరోసా కల్పించండిలా..


 మీ జీవితానికి సుస్థిర బాట వేసిన మీ నాన్నకు భరోసా కల్పించాలనుకుంటున్నారా..?

 ఫాదర్స్‌ డే నాడు  మీ తండ్రి భవిష్యత్‌ అవసరాలను తీర్చగలిగే ఆర్థిక బహుమతి అందించండి. 

అందుకు  ఉన్న అవకాశాలు మీ కోసం..


యాడ్‌ ఆన్‌ కార్డ్‌: మీ క్రెడిట్‌ కార్డుపై యాడ్‌ ఆన్‌ కార్డు తీసుకోగలిగే వెసులుబాటు ఉంటే, దాన్ని మీ నాన్నకు గిఫ్ట్‌ గా ఇవ్వవచ్చు. తద్వారా చిన్న మొత్తాల్లో ఖర్చుల కోసం వారు ఆ కార్డును ఉపయోగించుకునే వీలుంటుంది. 


మ్యూచువల్‌ ఫండ్స్‌: మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల్లో, ముఖ్యంగా గ్యారంటీడ్‌ ఇన్‌కమ్‌ ప్లాన్లలో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా రిటైర్మెంట్‌ తర్వాత దశలో వారికి ఆర్థిక భరోసా లభిస్తుంది. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టలేని పక్షంలో, క్రమానుగత పెట్టుబడి పథకాల (సి్‌ప)నూ ఎంచుకోవచ్చు.

 

బీమాతో ధీమా: మీ నాన్న పేరిట బీమా పాలసీ కొనుగోలు చేయవచ్చు. అవసరాన్ని బట్టి లైఫ్‌ ఇన్సూరెన్స్‌ లేదా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీని అందించవచ్చు. అసలే కరోనా కాలం. వైద్య ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. ఇలాంటి సంక్షోభ సమయాల్లో నడి వయసు దాటిన వారికి ఆరోగ్య బీమా కవరేజీ చాలా ముఖ్యం. 


పొదుపు పథకాలు: మీ నాన్న పేరు మీద కొంత సొమ్మును ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయవచ్చు. ఒకవేళ సీనియర్‌ సిటిజన్‌ అయితే, అధిక వడ్డీ చెల్లించే పొదుపు పథకాలు చాలా అందుబాటులో ఉన్నాయి. బ్యాంకులు, పోస్టాఫీ్‌సతోపాటు కార్పొరేట్‌ సంస్థలూ వీరి కోసం ప్రత్యేక పథకాలను ఆఫర్‌ చేస్తున్నాయి. 


షేర్లు,సెక్యూరిటీలు: భవిష్యత్‌లో మంచి ప్రతిఫలాలు అందించేందుకు అవకాశాలున్న కంపెనీల షేర్లనూ కానుకగా ఇవ్వండి. ప్రభుత్వ బాండ్లు, డిబెంచర్లలోనూ వారి పేరిట పెట్టుబడులు పెట్టవచ్చు.

Updated Date - 2021-06-20T09:35:59+05:30 IST