Today ipl Match: RR vs PBKS మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్.. RR దురదృష్టం ఏంటంటే..

ABN , First Publish Date - 2022-05-07T20:53:24+05:30 IST

IPL 2022 సీజన్‌లో భాగంగా మరో కీలక పోరుకు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదిక కాబోతోంది. శనివారం సాయంత్రం 3.30 గంటలకు రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య..

Today ipl Match: RR vs PBKS మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్.. RR దురదృష్టం ఏంటంటే..

ముంబై: IPL 2022 సీజన్‌లో భాగంగా మరో కీలక పోరుకు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదిక కాబోతోంది. శనివారం సాయంత్రం 3.30 గంటలకు రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య రసవత్తర మ్యాచ్ మొదలు కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. రాజస్థాన్ రాయల్స్ జట్టులో కరుణ్ నాయర్ ఈ మ్యాచ్‌లో అందుబాటులో లేడు. యశస్వి జైశ్వాల్ అతని స్థానంలో జట్టులోకి వచ్చాడు. పంజాబ్ జట్టులో ఎలాంటి మార్పులు లేవు. రాజస్థాన్ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ దురదృష్టమేంటో తెలియడం లేదు గానీ 11 మ్యాచ్‌లు ఆడితే 10 మ్యాచ్‌ల్లో టాస్ ఓడిపోయాడు. ఫస్ట్ బ్యాటింగ్‌కు పిచ్ అనుకూలంగా ఉందన్న అంచనాతో, తొలుత బ్యాటింగ్ చేసి భారీ టార్గెట్‌ను రాజస్థాన్ జట్టు ముందు ఉంచాలని పంజాబ్ జట్టు కెప్టెన్ మయాంక్ అగర్వాల్ భావిస్తున్నాడు.



రాజస్థాన్ రాయల్స్: జాస్ బట్లర్, యశస్వి జైశ్వాల్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్/కెప్టెన్), దేవ్‌దత్ పడిక్కల్, రియాన్ పరాగ్, హెట్మైర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసీద్ కృష్ణ, చాహల్, కుల్దీప్ సేన్


పంజాబ్ కింగ్స్: బెయిర్‌స్ట్రో, శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్(కెప్టెన్), రాజపక్స, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), రిషి ధావన్, రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్, సందీప్ శర్మ

Read more