నేడు చలో హైదరాబాద్‌: వీహెచ్‌పీఎస్‌

ABN , First Publish Date - 2021-11-26T09:47:30+05:30 IST

దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి శుక్రవారం చలో హైదరాబాద్‌ కార్యక్రమం చేపట్టనున్నట్లు వికలాంగుల హక్కుల పోరాట సమితి(వీహెచ్‌పీఎస్‌) జాతీయ అధ్యక్షుడు ఎల్‌.గోపాల్‌రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

నేడు చలో హైదరాబాద్‌: వీహెచ్‌పీఎస్‌

హైదరాబాద్‌, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి) : దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి శుక్రవారం చలో హైదరాబాద్‌ కార్యక్రమం చేపట్టనున్నట్లు వికలాంగుల హక్కుల పోరాట సమితి(వీహెచ్‌పీఎస్‌) జాతీయ అధ్యక్షుడు ఎల్‌.గోపాల్‌రావు గురువారం ఒక  ప్రకటనలో తెలిపారు. ఇందిరాపార్క్‌ వద్ద బహిరంగసభ నిర్వహిస్తామన్నారు. సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి దివ్యాంగులు హాజరు కావాలని  విజ్ఞప్తి చేశారు. పెన్షన్‌ రూ.3016 నుంచి రూ.6 వేలకు పెంచాలని, వికలాంగుల సంక్షేమశాఖను స్వతంత్రంగా ఉంచి, సహకార సంస్థను బలోపేతం చేయాలని డిమాండ్‌ చేశారు.


వికలాంగుల సంక్షేమానికి కృషి చేయండి: హక్కుల వేదిక  

దివ్యాంగుల సంక్షేమం, అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కేసీఆర్‌కు అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. డిసెంబరు 3న ప్రపంచ దివ్యాంగుల దినం సందర్భంగా రాష్ట్రంలోని 10 లక్షల మంది దివ్యాంగులకు మేలుజరిగే  నిర్ణయం  ప్రభుత్వం తీసుకోవాలన్నారు. పేద దివ్యాంగులకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు, స్వయం ఉపాధికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించాలని కోరారు.

Updated Date - 2021-11-26T09:47:30+05:30 IST