నేడు ఈ-ఓటింగ్‌ డ్రైరన్‌

ABN , First Publish Date - 2021-10-20T04:35:45+05:30 IST

దేశంలో తొలిసారిగా ఖమ్మంలో ఆండ్రాయిడ్‌ యాప్‌ ఆధారిత ఈ-ఓటింగ్‌ డ్రై రన్‌ను బుధవారం ప్రయోగాత్మకంగా నిర్వహించబోతున్నారు. ఈ నెల 8

నేడు ఈ-ఓటింగ్‌ డ్రైరన్‌

దేశంలోనే తొలిప్రయత్నంగా ఖమ్మంలో అమలు 

ఖమ్మం, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి ) : దేశంలో తొలిసారిగా ఖమ్మంలో ఆండ్రాయిడ్‌ యాప్‌ ఆధారిత ఈ-ఓటింగ్‌ డ్రై రన్‌ను బుధవారం ప్రయోగాత్మకంగా నిర్వహించబోతున్నారు. ఈ నెల 8నుండి 18వరకు యాప్‌ ద్వారా ఖమ్మం నియోజకవర్గ ఓటర్లు రిజిసే్ట్రషన్లు చేయించుకున్నారు. వారందరికీ బుధవారం ఫోన ద్వారా ఓటు వేసే సౌలభ్యాన్ని ఖమ్మం నగరపాలక సంస్థ అఽధికారులు కల్పిస్తున్నారు. దేశంలో తొలిసారిగా రాష్ట్ర ఎన్నికల కమిషన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ- ఓటింగ్‌  డ్రైరన్‌ విజయవంతమైతే భవిష్యతలో వృద్ధులు, వికలాంగులు, పోలింగ్‌ సిబ్బంది, అనారోగ్యాలతో ఆస్పత్రుల్లో ఉన్న వారు, ఇతర ప్రాంతాల్లో ఉండి.. బలమైన కారణాలతో రాలేని వారు ఈ-ఓటింగ్‌ పద్ధతిలో ఇంటి వద్దనే ఫోన ద్వారా ఓటు వేసుకొనే అవకాశం కలుగుతుంది. ఇప్పటికే ఎస్టోనియా అనే దేశంలో 40 శాతం ఓటర్లు ఆనలైనలోనే ఓటు వేస్తున్నారు. అక్కడి ఎన్నికల చట్టాలు, సాంకేతిక పరిజ్ఙానంతో ఈ-ఓటింగ్‌ ప్రక్రియను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇదే పద్ధతిని మన దేశంలో అదీ తెలంగాణాలో మొదటి సారిగా నిర్వహించాలని 2018లో ఎస్టోనియా ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అక్కడి సాంకేతిక పరిజ్ఞానం అనుసరించి తెలంగాణా ఎన్నికల సంఘం ఖమ్మంలో డమ్మీ ఓటింగ్‌ నిర్వహించాలని ఇటీవల నిర్ణయించింది. యాప్‌లో రిజిసే్ట్రషన్‌ చేసుకున్న ఓటర్లు బుధవారం జరిగే ఈ ఓటింగ్‌ డ్రైరన్‌లో పాల్గొని ఓటేయనున్నారు.

Updated Date - 2021-10-20T04:35:45+05:30 IST