నేడు విధుల్లో చేరనున్న డీఎంహెచ్‌వో

ABN , First Publish Date - 2021-02-27T05:48:31+05:30 IST

డీఎంహెచ్‌వో డా.బి.రామగిడ్డయ్య శనివారం విధుల్లో చేరనున్నారు.

నేడు విధుల్లో చేరనున్న డీఎంహెచ్‌వో

కర్నూలు(హాస్పిటల్‌), ఫిబ్రవరి 26: డీఎంహెచ్‌వో డా.బి.రామగిడ్డయ్య శనివారం విధుల్లో చేరనున్నారు. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కలెక్టర్‌ డీఎంహెచ్‌వోపై సీరియస్‌ అయిన విషయం తెలిసిందే. ఈనెల 19న కలెక్టరేట్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ముందుకు సాగడం లేదని, అందుకే డీఎంహెచ్‌వోను సరెండర్‌ చేస్తున్నామని కలెక్టర్‌ తెలిపారు. సమీక్ష సమావేశానికి డా.రామగిడ్డయ్య హాజరు కాకపోవడంతో ఆయన్ను సరెండర్‌ చేస్తారన్న ప్రచారం వైద్య ఆరోగ్యశాఖలో సాగుతోంది. సెలవులు ముగియడంతో డీఎంహెచ్‌వో విధుల్లో చేరుతారా లేదా అన్న చర్చ జరగుతోంది. ఈ నేపథ్యంలో డా.రామగిడ్డయ్య కలెక్టర్‌ను శుక్రవారం కలిసి వ్యాక్సినేషన్‌పై వివరణ ఇచ్చినట్లు తెలిసింది. దీనిపై కలెక్టర్‌ సం తృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. డా.రాగిడ్డయ్య  శనివారం విధుల్లో చేరతారని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి చెందిన ఓ ముఖ్య అధికారి తెలిపారు.

Updated Date - 2021-02-27T05:48:31+05:30 IST