Abn logo
Oct 13 2021 @ 00:23AM

నేటి అలంకరణ శ్రీ దుర్గాదేవి

13-10-2021

ఆశ్వయుజ శుద్ధ అష్టమి (దుర్గాష్టమి) బుధవారం 

రన్నవరాత్రి ఉత్సవాలలో ఎనిమిదో రోజున విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ అనంత శక్తి స్వరూపమైన శ్రీ దుర్గాదేవిగా దర్శనమిస్తారు. ఈ అవతారంలో... దుర్గముడనే రాక్షసుడిని ఈ అష్టమి తిథి రోజునే దుర్గమ్మ సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఆ అష్టమిని ‘దుర్గాష్టమి’ అని వ్యవహరిస్తారు.  ‘దుర్గే దుర్గతినాశని’... అంటే దుర్గతులను నాశనం చేసే వేలుపు ద్గుమ్మ. ఈ రోజున అమ్మవారి దర్శనంతో దుర్గతుల నుంచి తప్పించుకోవచ్చనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. పంచ ప్రకృతి మహా స్వరూపాల్లో దుర్గారూపం మొదటిది. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని ఈ మాత అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదిస్తుందనీ, కోటి సూర్యప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రుబాధలు తొలుగుతాయనీ,  సర్వత్రా విజయం ప్రాప్తిస్తుందనీ నమ్మిక. 


నైవేద్యం: గారెలు, చిత్రాన్నం

అలంకరించే చీర రంగు: ఎరుపు

వేటితో అర్చించాలి?: గులాబీలు, ఎర్రటి పూలు, కుంకుమ, ఎర్రటి అక్షతలు

పారాయణ: చెయ్యాల్సింది: దుర్గా సూక్తం, దుర్గా సప్తశ్లోకి