నేడు కల్నల్‌ సంతోష్బాబు కాంస్య విగ్రహ ఆవిష్కరణ

ABN , First Publish Date - 2021-06-15T08:54:48+05:30 IST

భారత్‌-చైనా సరిహద్దులో విధులు నిర్వర్తిస్తూ భారతావని కోసం వీరోచితంగా పోరాడి అమరుడైన కల్నల్‌ సంతో్‌షబాబు కాంస్య విగ్రహాన్ని మంత్రులు కేటీఆర్‌, జగదీశ్‌రెడ్డి మంగళవారం ఆవిష్కరించనున్నారు.

నేడు కల్నల్‌ సంతోష్బాబు కాంస్య విగ్రహ ఆవిష్కరణ

కేటీఆర్‌, జగదీశ్‌రెడ్డి చేతుల మీదుగా కార్యక్రమం

సూర్యాపేట/నల్లగొండ, జూన్‌ 14(ఆంధ్రజ్యోతి): భారత్‌-చైనా సరిహద్దులో విధులు నిర్వర్తిస్తూ భారతావని కోసం వీరోచితంగా పోరాడి అమరుడైన కల్నల్‌ సంతో్‌షబాబు కాంస్య విగ్రహాన్ని మంత్రులు కేటీఆర్‌, జగదీశ్‌రెడ్డి మంగళవారం ఆవిష్కరించనున్నారు. సరిహద్దులో 2020, జూన్‌ 15న చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో సూర్యాపేటకు చెందిన కల్నల్‌ సంతో్‌షబాబుతో పాటు మరి కొంతమంది జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సంతో్‌షబాబు వీరోచిత  పోరాట స్ఫూర్తి ఎప్పటికీ గుర్తుండిపోయేలా సూర్యాపేట జిల్లా కేంద్రంలో కల్నల్‌ సంతో్‌షబాబు కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చే సింది. హైదరాబాద్‌ జేఎన్టీయూ ఫైన్‌ఆర్ట్స్‌ ప్రిన్సిపాల్‌ శ్రీనివా్‌సరెడ్డి ఆధ్వర్యంలో కాంస్య విగ్రహాన్ని తయారు చేయించింది. ఇందుకు మునిసిపల్‌ శాఖ నుంచి 21లక్షలు సమకూర్చారు. 80కిలోల బరువు, తొమ్మిది అడుగుల విగ్రహాన్ని రూపుదిద్దారు. సంతోష్‌బాబు ప్రథమ వర్థంతి సందర్భంగా మంగళవారం విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు. 

Updated Date - 2021-06-15T08:54:48+05:30 IST