YS Jagan, Vijayasai బెయిల్ రద్దుపై సీబీఐ కోర్టు నేడు కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2021-08-25T14:06:45+05:30 IST

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై కూడా సీబీఐ కోర్టు ఇవాళ..

YS Jagan, Vijayasai బెయిల్ రద్దుపై సీబీఐ కోర్టు నేడు కీలక నిర్ణయం

హైదరాబాద్ : వైసీపీ ఎంపీ, కీలకనేత విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై సీబీఐ కోర్టులో నేడు విచారణ జరగనున్నది. విజయసాయిరెడ్డి కౌంటర్‌పై నేడు వాదనలు జరగనున్నాయి. ఇప్పటికే ఈ అంశాన్ని కోర్టు విచక్షణకు వదిలేస్తున్నట్లు సీబీఐ మెమో దాఖలు చేసిన విషయం విదితమే. విజయసాయిరెడ్డి కౌంటర్‌పై ఇవాళ సీబీఐ కోర్టు ఇరు వాదనలు విని తుది నిర్ణయం వెల్లడించనుంది.


నేడు కీలక నిర్ణయం..

మరోవైపు.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై కూడా సీబీఐ కోర్టు ఇవాళ తుది తీర్పు వెల్లడించనుంది. జగన్ బెయిల్ రద్దు అంశంపై ఇరు పక్షాల వాదనలు ముగిశాయి. బెయిల్ రద్దుపై ఇవాళ సీబీఐ కోర్టు కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సీబీఐ తీర్పుపై ఇటు తెలుగు ప్రజల్లో, వైసీపీలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా.. వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలుచేసిన ఈ పిటిషన్‌పై జూలై ఆఖరులో వాదనలు ముగిశాయి. తీర్పును అప్పటినుంచి కోర్టు రిజర్వు చేసింది. ముఖ్యమంత్రిగా తనకుండే అధికారాలను ఉపయోగించి.. జగన్‌ బెయిల్‌ షరతులు ఉల్లంఘిస్తున్నారని రఘురామ ఏప్రిల్‌ మొదటి వారంలో దాఖలు చేసిన పిటిషన్‌లో ఆరోపించారు. బెయిల్‌ రద్దుచేసి ఆయనపై ఉన్న కేసులను శరవేగంగా విచారించాలని కోరారు.

Updated Date - 2021-08-25T14:06:45+05:30 IST