జిల్లాలో సరాసరి వర్షపాతం 10.6 మి.మీ.

ABN , First Publish Date - 2021-05-18T05:55:03+05:30 IST

జిల్లా వ్యాప్తంగా సోమవారం తెల్లవారు జామున పిడుగులతో కూడిన వర్షాలు కురిశాయి.

జిల్లాలో సరాసరి వర్షపాతం 10.6 మి.మీ.

ఏలూరు సిటీ, మే 17: జిల్లా వ్యాప్తంగా సోమవారం తెల్లవారు జామున  పిడుగులతో కూడిన వర్షాలు కురిశాయి. గడచిన 24 గంటల్లో జిల్లాలో అత్యధికంగా బుట్టాయగూడెం మండలంలో 37.4 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. జిల్లాలో అన్ని మండలాలతో కలిపి మొత్తం 510. 2 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు కాగా జిల్లాలో సరాసరి వర్షపాతం 10.6 మిల్లీమీటర్లుగా నమోదైంది. జీలుగుమిల్లి మండలంలో 32.4 , గణపవరం  30.4, టి. నరసాపురం  30.2, నిడమర్రు 26.2, భీమడోలు  23.8, ఆకివీడు  22.6 ద్వారకాతిరుమల  22, ఉంగుటూరు  21.4, లింగపాలెం 21, కామవరపుకోట 18.6, నల్లజర్ల 18.4, తాడేపల్లిగూడెం 17.8, పెంటపాడు, వీరవాసరంలలో 13.4, దెందులూరులో 12.4, పెదపాడులో 11.2, పాలకోడేరు మండలంలో 10.4 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. జిల్లాలోని మిగిలిన మండలాల్లో 10 మిల్లీమీటర్ల కన్నా తక్కువగానే వర్షపాతం నమోదైంది. 

రైతులు గగ్గోలు 

సోమవారం తెల్లవారుఝామున కురిసిన అకాల వర్షాలకు  ఆరబోసిన ధాన్యం,  మొక్కజొన్న పంట తడిసిపోయింది. కుప్పల మీద ఉన్న ధాన్యం కూడా తడిసిపోయింది.  దీంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే ఇటీవల కురిసిన వర్షాలకు మొక్కజొన్న, ఽధాన్యం తడిసిపోవటంతో ఆరబెట్టుకుంటున్నామని,  మళ్ళీ వర్షాలకు తడిసిపోయిందని నల్లజర్ల మండలం అనంతపల్లి గ్రామానికి చెందిన పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 


Updated Date - 2021-05-18T05:55:03+05:30 IST