నేటినుంచి 16,709 ప్రత్యేక బస్సులు

ABN , First Publish Date - 2022-01-17T16:14:11+05:30 IST

సంక్రాంతి పండుగ కోసం సొంతూళ్ళకు వెళ్ళిన వారు తిరిగి నగరాలకు చేరుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి 16,709 ప్రత్యేక బస్సులను నడుపనుంది. ఈ మేరకు రాష్ట్ర రవాణా సంస్థలు

నేటినుంచి 16,709 ప్రత్యేక బస్సులు

                      - ప్రభుత్వ రవాణా సంస్థ ఏర్పాట్లు 


అడయార్‌(చెన్నై): సంక్రాంతి పండుగ కోసం సొంతూళ్ళకు వెళ్ళిన వారు తిరిగి నగరాలకు చేరుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి 16,709 ప్రత్యేక బస్సులను నడుపనుంది. ఈ మేరకు రాష్ట్ర రవాణా సంస్థలు ప్రత్యేక చర్యలు తీసుకున్నాయి. 17వ తేదీ సోమవారం రోజువారీ బస్సు సర్వీసులు 2,100 నడుపుతారు. ఇవికాకుండా 5,655 ప్రత్యేక బస్సులను నడిపేలా ఏర్పాట్లు చేశారు. అలాగే, 18వ తేదీ రోజు వారీ బస్సులు 2,100, ప్రత్యేక బస్సులు 3,214, 19న రెగ్యులర్‌ సర్వీసులు 2,100, ప్రత్యేక బస్సులు 1,540 చొప్పున నడిపేలా రవాణా శాఖ ఏర్పాట్లు చేసింది. సోమ వారం నుంచి మూడు రోజుల పాటు రోజువారీ సర్వీసులతో పాటు ప్రత్యేక బస్సు సర్వీసులు కలుపుకుని మొత్తం 16,709 బస్సులను నడుపనుంది. ఇవికాకుండా, దక్షిణ రైల్వే కూడా పలు ప్రత్యేక రైళ్ళను నడిపేలా చర్యలు తీసుకుంది. వీటితో పాటు ప్రైవేటు బస్సులు కూడా అధిక సంఖ్యలో నడిపేలా చర్యలు తీసుకున్నారు. ఈ బస్సులు తిరునెల్వేలి, కన్నియాకుమారి, మదురై, తిరుచ్చి, సేలం, కోయం బత్తూరు, ఈరోడ్‌, తంజావూరు తదితర ప్రాంతాల నుంచి నడుపున్నారు. ఇప్పటికే ఈ బస్సుల్లోని టిక్కెట్లన్నీ రిజర్వు అయిపోయాయి.


Updated Date - 2022-01-17T16:14:11+05:30 IST