భారీగా పొగాకు నిషేధిత ఉత్పత్తుల స్వాధీనం

ABN , First Publish Date - 2021-07-31T05:10:24+05:30 IST

సెబ్‌ అధికారులు నగరంలోని వెంగళరావు నగర్‌లో ఉన్న అక్బర్‌ ఫ్యాన్సీ అండ్‌ ప్రొవిజన్స్‌ దుకాణంలో శుక్రవారం తనిఖీలు నిర్వహించారు

భారీగా పొగాకు నిషేధిత ఉత్పత్తుల స్వాధీనం
పొగాకు నిషేధిత ఉత్పత్తులు, నిందితుడితో సెబ్‌ పోలీసులు

నెల్లూరు(క్రైం), జూలై 30:  సెబ్‌ అధికారులు నగరంలోని వెంగళరావు నగర్‌లో ఉన్న అక్బర్‌ ఫ్యాన్సీ అండ్‌ ప్రొవిజన్స్‌ దుకాణంలో శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. పొగాకు నిషేధిత ఉత్పత్తులైన హాన్స్‌ 6000, మధు 576, రాజా 968, విమల్‌ 4680, వి1 6240, జి 16000 చొప్పున మెత్తం 34,460 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇన్‌స్పెక్టర్‌ కె.పి. కిశోర్‌ సెబ్‌ నెల్లూరు-1 స్టేషన్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించి వివరాలను తెలిపారు. ‘సెబ్‌ జాయింట్‌ డైరెక్టర్‌ కె. శ్రీలక్ష్మి ఆదేశాల మేరకు నెల్లూరు సెబ్‌-1 పోలీసులకు వచ్చిన సమాచారంతో సయ్యద్‌ అక్బరుద్దీన్‌ దుకాణంలో దాడులు నిర్వహించాం. నిందితుడిని అరెస్టు చేసి విచారించగా బెంగళూరు వెళ్లి అక్కడ నుంచి నిషేధిత వస్తువులను కొనుగోలు చేసి ప్రైవేటు ట్రావెల్‌ బస్సులో   వస్ర్తాల లోడు అని చెప్పి నగరానికి తీసుకు వచ్చినట్టు తెలిపినట్లు వివరించారు. నిషేధిత  వస్తువుల విలువ రూ.2లక్షల పైగా ఉంటుంది’ అని తెలిపారు.  కార్యక్రమంలో ఎస్‌ఐ ఎ. శ్రీనివాసరావు, హెడ్‌ కానిస్టేబుల్‌ ఎస్‌కెఎం రషీద్‌, కానిస్టేబుల్‌ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-31T05:10:24+05:30 IST