పొగాకు ధర ఆశాజనకం

ABN , First Publish Date - 2022-06-29T06:05:26+05:30 IST

పొగాకు ధర ఆశాజనకం

పొగాకు ధర ఆశాజనకం
జంగారెడ్డిగూడెం పొగాకు వేలం కేంద్రం

 కేజీ రూ.200 మార్కు దాటింది..ఈ ఏడాది గరిష్ఠంగా రూ.203 నమోదు.. సగానికిపైనే కొనుగోలు పూర్తి
జంగారెడ్డిగూడెం, జూన్‌ 28: వాణిజ్య పంట వర్జీనియా పొగాకు ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. సోమవారం కొనుగోలు ప్రక్రియలో జంగారెడ్డిగూడెం–1, దేవరపల్లి, గోపాలపురం బోర్డుల్లో కేజీ పొగాకు ధర రూ.200 మార్కును దాటింది. ఈ ఏడాది మార్చి 28న ఎన్‌ఎల్‌ఎస్‌ ఏరియాలోని జంగారెడ్డిగూడెం–1, జంగారెడ్డి గూడెం–2, కొయ్యలగూడెం, గోపాలపురం, దేవరపల్లి పొగాకు వేలం కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియ ప్రారం భమైంది. మొదటి రోజు కేజీ పొగాకు రూ.195 పలికింది. 74వ రోజు సోమవారం కేజీ పొగాకు రూ.200 దాటింది. మంగళవారం రూ.203కు చేరుకుంది. ఈ ఏడాది లోగ్రేడ్‌ పొగాకు ధరలు ఆశాజనకంగానే ఉండటంతో రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.


Updated Date - 2022-06-29T06:05:26+05:30 IST