6 సెకన్లకు ఒకరిని చంపేస్తున్న పొగాకు

ABN , First Publish Date - 2021-12-29T09:25:21+05:30 IST

పొగాకు వాడకం వల్ల ప్రతి 6 సెక్షన్లకు ఒక వ్యక్తి ప్రాణం గాలిలో కలిసిపోతోందని కి మ్స్‌ ఆస్పత్రి సీనియర్‌ గ్యాస్ర్టో ఎంటరాలజీ జనరల్‌ సర్జన్‌ డా.సురేష్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

6 సెకన్లకు ఒకరిని చంపేస్తున్న పొగాకు

  • తల, మెడ కేన్సర్‌ కేసుల్లో ప్రపంచంలోనే రెండో స్థానంలో భారత్‌
  • కిమ్స్‌ ఆస్పత్రి సీనియర్‌ గ్యాస్ర్టో 
  • ఎంటరాలజీ జనరల్‌ సర్జన్‌ డా.సురేష్‌
  • ప్రపంచంలో ఏటా 8 మిలియన్ల మంది మృతి
  • సర్జికల్‌ స్కిల్‌ హెడ్‌ డా.నాగేంద్ర పర్వతనేని 
  • కిమ్స్‌ ఫెల్లోషిప్‌ అవార్డుల ప్రదానం


హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 28 (ఆంధజ్యోతి) : పొగాకు వాడకం వల్ల ప్రతి 6 సెక్షన్లకు ఒక వ్యక్తి ప్రాణం గాలిలో కలిసిపోతోందని కి మ్స్‌ ఆస్పత్రి సీనియర్‌ గ్యాస్ర్టో ఎంటరాలజీ జనరల్‌ సర్జన్‌ డా.సురేష్‌ ఆందోళన వ్యక్తం చేశారు. కిమ్స్‌ ఆస్పత్రి డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సర్జికల్‌ అంకాలజీ 3వ తల, మెడ అంకాలజీ ఫెల్లోషిప్‌ అవార్డుల ప్రదానోత్సవాన్ని మంగళవారం మాదాపూర్‌లో నిర్వహించారు. ఫెల్లోఫిష్‌ పూర్తి చేసిన డా.కిరణ్‌ దేవరకొండ, డాక్టర్‌ సంధ్యలకు డా.సురేష్‌, కిమ్స్‌ ఆస్పత్రి అకాడమిక్‌ ఇన్‌చార్జి డా.రాజగోపాల్‌, డైరెక్టర్‌ హరిణిలు అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్‌ సురేష్‌ మాట్లాడుతూ.. పొగాకు వాడకంతో వచ్చే తల, మెడ కేన్సర్‌ కేసుల్లో మన దేశం ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉందని, ఈ నేపథ్యంలో వైద్య నిపుణుల సంఖ్య మరింత పెరగాల్సిన అవసరముందని అన్నారు. కిమ్స్‌ ఆస్పత్రులు రెండేళ్లుగా ఫెలోషిప్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయని, ఇందులో తల, మెడ కేన్సర్‌లను క్లినికల్‌గా ఎదుర్కోవడంపై శిక్షణ ఇస్తునట్లు తెలిపారు.


వరంగల్‌లోని కాళోజీ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఈ ఫెల్లోషిప్‌ కార్యక్రమానికి గుర్తింపునిచ్చిందని చెప్పారు. కిమ్స్‌ సర్జికల్‌ స్కిల్‌ హెడ్‌ డాక్టర్‌ నాగేంద్ర పర్వతనేని మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఏటా 8 మిలియన్ల మంది పొగాకు కారక తల, మెడ కేన్సర్లతో చనిపోతున్నారని అన్నారు. కిమ్స్‌ ఫెల్లోషిప్‌ కార్యక్రమం తల, మెడ కేన్సర్‌లను వైద్యపరంగా ఎలా ఎదుర్కోవాలో? చికిత్స తర్వాత పునరావృతం కాకుండా ఏం చేయాలో తెలియజేస్తుందన్నారు. కేన్సర్‌కు పొగాకుకు ప్రత ్యక్ష సంబంధం ఉందని నిరూపితమైందని, ఈ రకమైన కేన్సర్‌లను తగ్గించేందుకు పొగాకు వాడకంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని అన్నారు. కేన్సర్‌ శస్త్ర చికిత్సలకు ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వస్తోందని, కిమ్స్‌లో ప్రతియేటా వందల సంఖ్యలో తల, మెడ కేన్సర్‌ రోగులకు శస్త్ర చికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కిమ్స్‌ ఆస్పత్రిలోని పలు విభాగాలకు చెందిన డాక్టర్లకు అవార్డులు అందజేశారు. 

Updated Date - 2021-12-29T09:25:21+05:30 IST