Abn logo
Sep 26 2021 @ 23:31PM

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

బుట్టాయగూడెంలో ప్రతిజ్ఞ చేస్తున్న రైతులు

బుట్టాయగూడెం, సెప్టెంబరు 26: పర్యావరణాన్ని పరిరక్షించుకోవలసిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని గుంటూరు పొగాకు బోర్డు అధికారులు దా మోదర్‌, సుబ్బారావు అన్నారు. అధిక అమృత మహోత్సవంలో భాగంగా పొగాకు బోర్డు ఆధ్వర్యంలో అధికారులు, రైతులు మొక్కలు నాటారు. గ్లోబ లైజేషన్‌ కారణంగా పర్యావరణం సమతుల్యం దెబ్బతింటున్న ఇదే సమయం లో మొక్కలను నాటి వాటిని పెంచడం వలనే పర్యావరణాన్ని పరిరక్షించుకో గలుగుతామని అధికారులు స్పష్టం చేశారు. రెడ్డిగణపవరంలో బోర్డు ఆధ్వ ర్యంలో హైస్కూల్‌ ఆవరణలో 600 మొక్కలను నాటారు. బుట్టాయగూడెం– రెడ్డిగణపవరం, బుట్టాయగూడెం–కొమ్ముగూడెం రోడ్డుకిరువైపులా వెయ్యి మొ క్కలను నాటారు. నాటిన ప్రతిమొక్కను పరిరక్షించుకుంటామని రైతులతో  ప్రతిజ్ఞ చేయించారు. సొసైటీ అధ్యక్షుడు అల్లూరి రత్నాజీరావు, ఎంపీటీసీ అల్లూరి ర్మామోహనరావు, ఆక్షన్‌ సూపరింటెండెంట్‌ సత్యశ్రీనివాస్‌, రైతులు యంట్రప్రగడ శ్రీనివాసరావు, ఆలపాటి ఫణికిశోర్‌, గద్దె అబ్బులు, కుందుల శ్రీను, గద్దె శ్రీధర్‌, ప్లోర్‌ కమిటీ మెంబరు బాబు రాజేంద్రప్రసాద్‌, వింజరపు రవి, అల్లూరి సోమేశ్వరావు, యాండ్ర రవి తదితరులు పాల్గొన్నారు.

చిన్నాయిగూడెంలో మొక్కలు అందజేస్తున్న అధికారులు

దేవరపల్లి: మొక్కలు నాటి పరిరక్షించాలని పొగాకు వేలం నిర్వహణా ధికారి శంకరరావు అన్నారు. చిన్నాయిగూడెంలో పొగాకు రైతులకు మొక్కలు అందించటంతో పాటు గ్రామాల్లోని రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని శంకరరావు ప్రారంభించారు. చిన్నాయిగూడెం, యాదవోలు, గోపాలపురం, వాదాలకుంట, వెదుల్లకుంట గ్రామాల్లో 5వేల మొక్కలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పొగాకు రైతులు కాట్రగడ్డ శ్రీనివాస్‌ చౌదరి, పిన్నమనేని మధు, గడా రాంబాబు, చవల సూర్యచంద్రరావు, ఐటీసీ కంపెనీ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.