Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

కట్టాలా.. వద్దా..?

twitter-iconwatsapp-iconfb-icon
కట్టాలా.. వద్దా..? ఇక్కడ కనిపిస్తున్నది యాడికి మండలం రాయలచెరువులోని జగనన్న లే ఔట్‌. ఇక్కడ రెండేళ్ల కిందట 118 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేశారు. ఇదంతా కూడా కొండగుట్టల ప్రాంతం. ఎక్కడ చూసిన రాళ్లు కనిపిస్తాయి. పైగా కొండ పక్కనే మైనింగ్‌ కోసం అనుమతి పొందిన ఓ వ్యక్తి ఇక్కడ ఇంటి పట్టాలు ఎలా ఇస్తారని కోర్టుకెక్కాడు. దీంతో ప్రభుత్వం పరువుపోతుందని భావించి సమస్యను పరిష్కారించకుండా ఇంటి పట్టాల స్థానంలో బాధిత లబ్ధిదారులకు హామీ పత్రాలను అందజేసి చేతులు దులుపుకున్నారు. ఇప్పటికి రెండేళ్లు కావస్తున్నా.. సమస్యను పరిష్కారించకపోగా.. ఇంటి పట్టాలు ఎక్కడా ఇస్తారోనని బాధిత లబ్ధిదారులు ఆశగా ఎదురుచూడటం వారి వంతైంది.

గుట్టలు, వాగులు, శ్మశాన వాటికల్లో లేఔట్లు

ముందుకుసాగని నిర్మాణాలు పట్టాలు రద్దు 

చేస్తామని అధికారులు 

అయోమయంలో లబ్ధిదారులు


జిల్లా వ్యాప్తంగా మంజూరైన ఇళ్ల సంఖ్య - 67,772

లేఔట్‌లు                                 - 258

ఇప్పటికి ప్రారంభానికి నోచుకోనివి         - 14,871

వివిధ దశలలో 

నిర్మాణాలలో ఉన్నవి                         - 50,875

ఇళ్ల నిర్మాణం పూర్తైనవి                         - 2026

రెండో విడతలో మంజూరై ప్రారంభం 

కానివి                                                 - 5621


అనంతపురం, సిటీ జూలై 3: వైసీపీ అధికారంలోకి రాగానే... జిల్లా వ్యాప్తంగా  258 జగనన్న లేఔట్‌లను ఏర్పాటు చేసి 67,772 మందికి ఇంటి పట్టాలను మంజూరు చేసింది. ఆయితే పట్టాలు ఇచ్చిన స్థలాలు ఇళ్ల నిర్మాణానికి పనికి వస్తాయా.? రావా..? అనే అలోచన కూడా చేయకుండా  హడావుడిగా  పంపిణీ చేసేశారు. సీఎం జగనమోహనరెడ్డి  ఇల్లులు కాదు.. ఏకంగా ఊళ్లను నిర్మిస్తామని గొప్పగా ప్రకటించి పేదల్లో ఆశలను రేకేత్తించారు. లేఔట్లలో సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. కానీ క్షేత్రస్థాయిలో ఎలాంటి పురోగతి లేకపోవడం, కొండలు, గుట్టలు, శ్మశానవాటికల సమీపంలో ఇళ్ల స్థలాలు మంజూరు చేయడంతో లబ్ధిదారులు అయోమయంలో పడ్డారు.



కట్టాలా.. వద్దా..?

- అనంతపురం రూరల్‌ మండలం కామారుపల్లి గ్రామ పరిధిలోని జగనన్న లే ఔట్‌. ఇదీ చెరువు సమీపంలో ఉండటంతో పాటు గ్రామానికి దూరంగా ఉండటంతో ఇక్కడ ఇంటి నిర్మాణం కోసం లబ్ధిదారులు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదని అధికారుల వద్దనే వాపోయారు. ఇక్కడ అక్కంపల్లి, కక్కలపల్లికాలనీతో పాటు అనంతపురం జిల్లా కేంద్రంలోని 7000 మందికి పైగా ఇంటి పట్టాలను మంజూరు చేశారు. ఇప్పటికి అధికారులు సమస్యను పరిష్కరించకపోగా.. ఒక్క ఇల్లు కూడా ఇక్కడ నిర్మాణం సాగలేదు. 

కట్టాలా.. వద్దా..?

- పుట్లూరు  మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కొండగుట్టలలో 56 మందికి రెండేళ్ల కిందట ఇంటి పట్టాలు మంజూరు చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. ఆయితే ఈ ప్రాంతం కొండగుట్టలలో ఉండటంతో పాటు గ్రామానికి దూరంగా ఉండటం, ఇప్పటికి వరకు అధికారులు ఏలాంటి సదుపాయాలు కల్పించకపోవడంతో ఇళ్ల నిర్మాణం పూర్తిగా ఆగిపోయాయి. అధికారులు మాత్రం ఇళ్ల నిర్మాణం చేపట్టి తీరాల్సిందేనని లబ్ధిదారులపై ఒత్తిడి చేస్తున్నారని వాపోతున్నారు. ఇవన్నీ కేవ లం ఉదాహరణలు మాత్రమే.. జిల్లాలో చాలా ప్రాంతాలలో ఇదే పరిస్థితి నెలకుంది.  

కట్టాలా.. వద్దా..?

- ఉరవకొండ శివారులోని చాబాల రోడ్డు సమీపంలో శ్మశానవాటిక సమీపంలో 170 మంది లబ్ధిదారులకు రెండేళ్ల కిందట జగనన్న ఇంటి పట్టాలు మంజూరు చేశారు. ఆయితే పక్కనే శ్మశాన వాటిక ఉండటంతో నిర్మాణాలు సాగలేదు. కేవలం 10 మంది లబ్ధిదారులు మాత్రమే నిర్మాణాలు చేపట్టారు. మిగిలిన వారు ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. అదేవిధంగా అదే సమీపంలోని హోతూరు రోడ్డులో కూడా 98 మందికి  ఇంటి పట్టాలు మంజూరు చేశారు. గ్రామా నికి దూరంగా ఉండటంతో లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదు. వీటితో పాటు కూడేరులో కేటాయించిన జగనన్న లేఔట్‌ కూడా ఇళ్ల నిర్మాణానికి అనుకూలంగా లేకపో వడంతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేదు.

సమస్యలను ఉన్నతాధికారులకు నివేదించాం..

స్థలాలు లేకపోవడంతో కొన్ని ప్రాంతాలలో ఎక్కడపడితే అక్కడ అధికారులు ఇంటి పట్టాలు ఇచ్చినట్లు తెలిసింది. వాటిని ఆయా ప్రాంతాల వారిగా రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించాం. జిల్లాలో చాలా ప్రాంతాలలో ఈ పరిస్థితి ఉన్న విషయం వాస్తవ మే. ఆయా ప్రాంతాల వారిగా రెవెన్యూ, హౌసింగ్‌ అధికారులు సంయుక్తంగా ఉన్నతాధికారులకు సమస్యలను నివేదించాం. ఉన్నతాధికారుల నుంచి తదుపరి ఆదేశాలు రాగానే.. బాధిత లబ్ధిదారులకు న్యాయం జరిగే విధంగా చూస్తాం. 

-  రాజశేఖర్‌, హౌసింగ్‌ పీడీ


స్థలానికే దిక్కులేదు.... - లక్ష్మీదేవి

మాది రాయలచెరువు. కూలీ పనిచేసుకుంటూ జీవిస్తున్నాం. 22 నెలల కిందట మాకు  హామీ పత్రం ఇచ్చారు. స్థలం ఎక్కడుందో కూడా తెలీదు. అధికారులను అడిగితే అదిగో.. ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు అవుతోంది. ఇక రెండేళ్లలో మాకు ఇంటి పట్టా ఇచ్చేది ఎప్పుడు..? ఇల్లు కట్టించేది ఎప్పుడు..?. చివరికి  పేదలకు ఇంటి పట్టాలు ఇచ్చేందుకు రాయలచెరువు పరిధిలో ప్రభుత్వ స్థలం లేదు. మరొక గ్రామంలో ఇస్తామని అధికారులు చెప్తున్నారు.


మరోచోట ఇస్తారో.. ఇవ్వరో..?

మాదీ అనంతపురం జిల్లా కేంద్రంలోని ఓ కాలనీ. నేను నా భర్త బేల్దారి పనిచేస్తూ జీవి స్తున్నాం. అద్దె ఇంటిలో ఉంటూ ఇద్దరు పిల్లల్ని చదివించుకుంటున్నాం. రెండేళ్ల కిందట మాకు కామారుపల్లిలోని జగనన్న కాలనీలో ఇంటి పట్టా ఇచ్చారు. స్థలం చెరువు సమీపంలో ఉండటంతో పాటు చౌడు భూమి కావడంతో చాలా మంది పట్టాలు వెనక్కి ఇచ్చేశాం. ఆయితే రెండేళ్లు పూర్తి అయినప్పటికి ఇప్పటికి కొత్త పట్టా ఇవ్వలేదు.మరో చోట స్థలం కూడా కేటాయించలేదు. అధికారులను అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదు. 

-షాహీదా ( పేరు మార్చాం)


శ్మశాన వాటిక సమీపంలో ఉండేది ఎలా..? 

మాది ఉరవకొండ పరిధిలోని ఓ గ్రామం. నా భార్య పేరు మీదు చాబాలరోడ్డు సమీపంలోని శ్మశానవాటిక సమీపంలో ఇంటి పట్టాను మంజూరు చేశారు.  ఇక్కడ ఎలా ఇల్లు కట్టుకోవాలో అర్థం కాని పరిస్థితి. మేము మాత్రమే కాదు.. ఏ ఒక్కరూ కూడా ఇక్కడ ఇంటి నిర్మాణం చేపట్టాలంటే భయపడుతున్నారు. ఇదంతా చూస్తుంటే.. పేదలకు ఇంటి పట్టాలు ఇచ్చామని చెప్పుకోవడానికి ప్రభుత్వం, అధికారులు హడావిడి చేస్తున్నట్లు కనిపిస్తోంది. 

- రమణయ్య (పేరు మార్చాం)


కొండల్లో ఇస్తే ఏం చేసేది...?

మాది పుట్లూరు మండల పరిధిలోని ఓ గ్రామం. మాది పేదకుటుంబం. రెవెన్యూ అధికారులు పుట్లూరు నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే కొండ ప్రాంతాలలో ఇంటి పట్టా మంజూరు చేశారు. అక్కడికి వెళ్లి చూస్తే భయమేసింది. కొండ గుట్టల్లో ఇల్లు ఎలా కట్టుకో వాలో.. అర్థం కాని పరిస్థితి. ఇలాంటి ప్రదేశాల్లో ఇంటి పట్టా ఇచ్చి ఏం లాభం. పేదల జీవి తాలతో ప్రభుత్వం ఆడుకుంటోంది. 

- మహాలక్ష్మి (పేరు మార్చాం)

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.