డిసెంబర్‌లో థియేటర్లకు..

హాస్యనటుడు గౌతంరాజు తనయుడు కృష్ణ హీరోగా నటించిన ‘కఠారి కృష్ణ’ చిత్రం డిసెంబరు 10న విడుదల కానుంది. సీనియర్‌ నటుడు మురళీమోహన్‌ విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోందనీ,  విడుదలైన నాలుగు రోజుల్లో ఈ ట్రైలర్‌ రెండు మిలియన్ల వ్యూస్‌ సాధించడం తమకు సంతోషం కలిగిస్తోందనీ, చిత్ర విజయంపై నమ్మకం పెరిగిందనీ చిత్ర నిర్మాతలు నాగరాజు తిరుమలశెట్టి, పి.ఎ.నాయుడు , దర్శకుడు ప్రకాశ్‌ తిరుమలశెట్టి చెప్పారు. చిత్రానికి క్లీన్‌ యూ సర్టిఫికెట్‌ వచ్చిందని తెలిపారు. చాణక్య, రేఖా నిరోషా, యష్నా చౌదరి, స్వాతిమండల్‌ తదితరులు ఈ చిత్రంలో నటించారు. 

Advertisement