Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sat, 02 Apr 2022 04:15:31 IST

మహిళల వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌కు రెఫరీగా సువర్ణ లక్ష్మి

twitter-iconwatsapp-iconfb-icon
మహిళల వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌కు  రెఫరీగా సువర్ణ లక్ష్మి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): తొలి అంతర్జాతీయ మహిళా మ్యాచ్‌ రెఫరీ గండికోట సువర్ణ లక్ష్మి సిగలో మరో ఘనత చేరింది. ఆదివారం న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న మహిళల వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌కు లక్ష్మి మ్యాచ్‌ రెఫరీగా నియమితురాలైంది. లక్ష్మితో పాటు మరో ముగ్గురు విదేశీ మహిళలు ఈ మ్యాచ్‌లో రెఫరీ బాధ్యతలు నిర్వహించనున్నారు. లారెన్‌ ఏజెన్‌బ్యాగ్‌ (దక్షిణాఫ్రికా), కిమ్‌ కాటన్‌ (న్యూజిలాండ్‌) ఆన్‌ ఫీల్డ్‌ అంపైర్లుగా, జాక్విలైన్‌ విలియమ్స్‌ టీవీ అంపైర్‌గా ఎంపికయ్యారు. ఈ మెగా టోర్నీకి 15 మంది మ్యాచ్‌ రెఫరీలగా తీసుకున్న ఐసీసీ అందులో 8 మంది మహిళలకు అవకాశం కల్పించడం విశేషం. 53 ఏళ్ల లక్ష్మిని 2018లో బీసీసీఐ తొలిసారిగా ఐసీసీ రెఫరీల బృందంలో చోటు కల్పించాల్సిందిగా సిఫారసు చేసింది. అయితే, ఆ ఏడాది లక్ష్మికి అవకాశం రాకపోవడంతో 2019లో మరోసారి బీసీసీఐ ఆమె పేరును ఐసీసీకి పంపింది.


రెండో ప్రయత్నంలో లక్ష్మికి ఐసీసీ ఇంటర్నేషనల్‌ రెఫరీల ప్యానెల్‌లో స్థానం దక్కింది. రాజమండ్రికి చెందిన లక్ష్మి 1987లో ప్రొఫెషనల్‌ క్రికెటర్‌గా కెరీర్‌ ఆరంభించింది. బిహార్‌, ఆంధ్ర, రైల్వేస్‌, కర్ణాటక జట్ల తరఫున ఆమె దేశవాళీ క్రికెట్‌ ఆడింది. 2004లో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన లక్ష్మి కొంతకాలం కోచ్‌గా పనిచేసింది. 2008లో మ్యాచ్‌ రెఫరీగా కొత్త కెరీర్‌ను ప్రారంభించిన ఆమె తన ప్రతిభతో అనతికాలంలోనే ఉన్నత స్థానానికి చేరింది. 2019లో ఐసీసీ ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌ రెఫరీల ప్యానెల్‌లో స్థానం దక్కించుకున్న తొలి మహిళగా చరిత్ర సృష్టించింది.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.