గిరిజనులకు చేయూత

ABN , First Publish Date - 2021-06-17T05:09:52+05:30 IST

అటవీ భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులకు పట్టాలతో పాటు పంటల సాగుకు సాయం అందేలా చూడాలని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ సూచించారు. తన చాంబర్‌లో బుధవారం జరిగిన జిల్లా స్థాయి రివ్యూ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. తొలుత 1,016 మంది గిరిజనులకు సుమారు 1,928.87 ఎకరాలను ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాల కింద పంపిణీ చేసేందుకు ఆమోదం తెలిపారు.

గిరిజనులకు చేయూత
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌

1,016 మందికి పట్టాలు

కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ 

కలెక్టరేట్‌, జూన్‌ 16: అటవీ భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులకు పట్టాలతో పాటు పంటల సాగుకు సాయం అందేలా చూడాలని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ సూచించారు. తన చాంబర్‌లో బుధవారం జరిగిన జిల్లా స్థాయి రివ్యూ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. తొలుత 1,016 మంది గిరిజనులకు సుమారు 1,928.87 ఎకరాలను ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాల కింద పంపిణీ చేసేందుకు ఆమోదం తెలిపారు. అనంతరం మాట్లాడుతూ గిరిజనులకు కేవలం పట్టాలను పంపిణీ చేసి వదిలేయకుండా వివిధ ప్రభుత్వ పథకాల కింద ఉద్యాన, వ్యవసాయ పంటల సాగుకు సాయం అందించాలని చెప్పారు. ఐటీడీఏ పీవో కూర్మనాథ్‌ మాట్లాడుతూ ఈ విడతలో కొమరాడ మండలంలో 120 మంది గిరిజనులకు 317.68 ఎకరాలు, కురుపాంలో 485 మందికి 965.16 ఎకరాలు, పార్వతీపురంలో 171 మందికి 200.2 ఎకరాలు, పాచిపెంటలో 72 మందికి 69.85 ఎకరాలు, జీఎల్‌పురంలోని 168 మందికి 375.98 ఎకరాలపై సాగు హక్కు కల్పించామని, త్వరలో వీరికి పట్టాలు అందజేస్తామని చెప్పారు. సమావేశంలో అటవీ అధికారి సచిన్‌ గుప్తా, పార్వతీపురం ఆర్‌డీవో ఎస్‌.వెంకటేశ్వర్లు తదితరలు పాల్గొన్నారు. 



Updated Date - 2021-06-17T05:09:52+05:30 IST