అధికార కార్యక్రమానికి మున్సిపల్‌ చైర్‌పర్సన గైర్హాజరు!

ABN , First Publish Date - 2021-07-23T05:58:57+05:30 IST

ఇటీవల మున్సిపల్‌ కార్యాలయంలో జరిగే పలు అధికార కార్యక్రమాలకు మున్సిపల్‌ చైర్‌పర్సన ఇంద్రజ గైర్హాజరు కావడంపై అధికార వైసీపీతో పాటు మున్సిపాలిటీ చర్చనీయాంశంగా మారింది.

అధికార కార్యక్రమానికి   మున్సిపల్‌ చైర్‌పర్సన గైర్హాజరు!
ఖాళీగా దర్శనమిస్తున్న చైర్‌పర్సన, వైస్‌ చైర్మన కుర్చీలు

- అదేబాటలో మెజార్టీ కౌన్సిలర్లు 

- వైసీపీలో అంతర్గత అంతరం?

హిందూపురం టౌన, జూలై 22: ఇటీవల మున్సిపల్‌ కార్యాలయంలో జరిగే పలు అధికార కార్యక్రమాలకు మున్సిపల్‌ చైర్‌పర్సన ఇంద్రజ గైర్హాజరు కావడంపై అధికార వైసీపీతో పాటు మున్సిపాలిటీ చర్చనీయాంశంగా మారింది. కొద్దిరోజుల క్రితం జరిగిన ఓ అధికార కార్యక్రమానికి ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌ హాజరయ్యారు. అప్పటి వరకు మున్సిపల్‌ కార్యాలయంలో ఉన్న చైర్‌పర్సన వెళ్లిపోవడం, తరువాత కార్యక్రమానికి రాకపోవడంపై ఆరోజు పట్టణంలో చర్చ జరిగింది. తాజాగా గురువారం కాపునేస్తం పథకానికి సంబంధించి మున్సిపాలిటీలో అధికారికంగా ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పైగా ఈ వర్చువల్‌ మీట్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన కూడా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పాల్గొనే ఈ కార్యక్రమానికి మున్సిపల్‌ చైర్‌పర్సన ఇంద్రజ గైర్హాజరు కాకపోవడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. ప్రతి రోజూ చైర్‌పర్సన మున్సిపల్‌ కార్యాలయానికి తప్పనిసరిగా హాజరవుతున్నారు. కానీ అధికార కార్యక్రమాలకు మాత్రం హాజరు కాకపోవడంపై అంతుచిక్కడం లేదు. అదేవిధంగా మెజార్టీ కౌన్సిలర్లు కూడా ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. ఏది ఏమైనా హిందూపురం వైసీపీలో, అటు మున్సిపల్‌ పాలకవర్గంలో అంతర్గతంగా అంతరాలు ఏర్పడుతున్నాయని స్పష్టమవుతోంది. గైర్హాజర్‌ అంశపై మున్సిపల్‌ చైర్‌పర్సన ఇంద్రజను వివరణ కోరగా తనకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో కార్యక్రమానికి హాజరు కాలేదన్నారు. అయితే ఆమె భర్త శ్రీనివాసులు మాత్రం తమకు ఎలాంటి సమాచారం లేదని చెప్పడం గమనార్హం.




Updated Date - 2021-07-23T05:58:57+05:30 IST