తాండూరు నియోజకవర్గానికి.. 393 క్వింటాళ్ల కంది, పెసరు విత్తనాలు

ABN , First Publish Date - 2021-06-18T05:34:52+05:30 IST

తాండూరు నియోజకవర్గానికి.. 393 క్వింటాళ్ల కంది, పెసరు విత్తనాలు

తాండూరు నియోజకవర్గానికి.. 393 క్వింటాళ్ల కంది, పెసరు విత్తనాలు

  • ఏడీఏ శంకర్‌రాథోడ్‌
  • జాతీయ ఆహార భద్రత పథకం కింద అందజేత 

తాండూరు రూరల్‌ : తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్‌, యాలాల, తాండూరు, పెద్దేముల్‌ మండలాల రైతులు పంటలు సాగు చేసుకునేందుకు జాతీయ ఆహార భద్రత కింద 393 క్వింటాళ్ల విత్తనాలను అందజేసిందని తాండూరు ఏడీఏ శంకర్‌రాథోడ్‌ తెలిపారు. వీటిలో కంది విత్తనాలు 129క్వింటాళ్లు, పెసర్లు 264 క్వింటాళ్లు వచ్చాయన్నారు. తాండూరు మండలానికి కందులు 38 కి ్వంటాళ్లు, పెసర 80 క్వింటాళ్లు,  బషీరాబాద్‌ మండలానికి కందులు 29 క్వింటాళ్లు, పెసర 82 క్వింటాళ్లు, పెద్దేముల్‌ మండ లానికి కందులు 27 క్వింటాళ్లు, పెసర 51క్వింటాళ్లు, యాలాల మండలానికి కందులు 25క్వింటాళ్లు, పెసర 51 క్వింటాళ్లు, మొత్తం 393 క్వింటాళ్లు మంజూరయ్యాయన్నారు. వీటిలో కందులు 129, పెసర 264 క్వింటాళ్లు రైతులకు అందజేయడం జరుగుతుందన్నారు. ఆయా గ్రామాల్లో ప్రభుత్వం పంపిణీ చేసిన జాతీయ ఆహార భద్రత పథకం మంజూరైన విత్తనాలను పట్టారుపాస్‌ బుక్కు, ఆధార్‌ కార్డు జిరాక్స్‌ పత్రాలు ఆయా క్లస్టర్ల ఏఈవోలకు అందజేసి విత్తనాలను తీసుకెళ్లాలని కోరారు.

Updated Date - 2021-06-18T05:34:52+05:30 IST