పొట్ట కండరాల బలోపేతానికి...

ABN , First Publish Date - 2020-09-13T05:30:00+05:30 IST

చూడటానికి సులభంగా అనిపించే ఈ యోగాసనంతో కలిగే ప్రయోజనాలు ఎక్కువే. నావ ఆకారంలో శరీరాన్ని ఉంచడం వల్ల ఈ ఆసనానికి నౌకాసనం (బోట్‌ పోజ్‌) అని పిలుస్తారు.

పొట్ట కండరాల బలోపేతానికి...

చూడటానికి సులభంగా అనిపించే ఈ యోగాసనంతో కలిగే ప్రయోజనాలు  ఎక్కువే. నావ ఆకారంలో శరీరాన్ని ఉంచడం వల్ల ఈ ఆసనానికి నౌకాసనం (బోట్‌ పోజ్‌) అని పిలుస్తారు.

ఎలా వేయాలంటే...

కాళ్లు నిటారుగా చాచి నేలపై కూర్చోవాలి. తరువాత కాళ్లు మడిచి పాదాలు పూర్తిగా నేలపై ఆనించాలి.

ఇప్పుడు కొద్దిగా వెనక్కి వంగాలి. మీకు ఎంత వీలైతే అంత వరకు వంగాలి.

తరువాత కాళ్లు మెల్లగా పైకి ఎత్తాలి. మోకాళ్లను తాకుతున్నట్టుగా చేతులు పెట్టాలి.

ఈ భంగిమలో ఎంత సేపు వీలైతే అంతసేపు ఉండాలి. 

ఈ ఆసనాన్ని నేలపై పడుకుని కాళ్లు, అదే సమయంలో తల, వీపు భాగం ఒకేసారి నెమ్మదిగా పైకి ఎత్తడం ద్వారా కూడా వేయవచ్చు.

ఈ ఆసనం వేయడం వల్ల పొట్ట కండరాలు బలోపేతం అవుతాయి. జీర్ణసమస్యలు తగ్గిపోతాయి.

Updated Date - 2020-09-13T05:30:00+05:30 IST