40ఏళ్ల తర్వాత తోబుట్టువుల చెంతకు

ABN , First Publish Date - 2021-07-31T07:03:17+05:30 IST

11ఏళ్ల వయసులో ఇంట్లో నుంచి పారిపోయిన బాలుడు 40ఏళ్ల తర్వాత తిరిగి కుటుంబసభ్యుల చెంతకు చేరాడు.

40ఏళ్ల తర్వాత తోబుట్టువుల చెంతకు
ఎస్పీ సమక్షంలో పుల్లయ్యను అప్పగిస్తున్న శ్రీనివాస్‌

ఎస్పీ సమక్షంలో అప్పగింత 

 ఆనందం వ్యక్తంచేసిన చెల్లెళ్లు

నల్లగొండ, జూలై 30 : 11ఏళ్ల వయసులో ఇంట్లో నుంచి పారిపోయిన బాలుడు 40ఏళ్ల తర్వాత తిరిగి కుటుంబసభ్యుల చెంతకు చేరాడు. నల్లగొండ పట్టణంలోని పాతబస్తీ చాకలి బజార్‌కు చెందిన నల్లగంతుల రాములు కుమారుడు పుల్లయ్య ఆరో తరగతి చదివే రోజుల్లో తండ్రి మందలించాడని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. పలు ప్రాంతాల్లో భిక్షాటనతో కాలం గడిపిన అతడు చివరకు ఖమ్మం చేరుకున్నాడు. అతడిని మూడు నెలల క్రితం అన్నంసేవ ఫౌండేషన్‌ చైర్మన్‌ అన్నం శ్రీనివాస్‌ చేరదీసి ఆశ్రయం కల్పించాడు. పుల్లయ్య నుంచి వివరాలు సేకరించి నల్లగొండ ఎస్పీ రంగనాథ్‌ సమక్షంలో తోబుట్టువులకు శుక్రవారం అప్పగించారు. అనేక సంవత్సరాల తర్వాత  తమ సోదరుడు తిరిగి రావడంపై తోబుట్టువులు రేణుక, దుర్గ హర్షం వ్యక్తంచేశారు. 

Updated Date - 2021-07-31T07:03:17+05:30 IST