ఎర్రగుంట్ల, జూలై 3: ఎర్రగుంట్లనగరపంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే పెట్రోల్ బంకు స్థలాన్ని డీఎస్పీ వెంకటశివారెడ్డి ఆదివారం పరిశీలించారు. ఇటీవల పెట్రోల్ బంకును ఆర్టీసీ బస్టాండు పక్కన, హిందూ శ్మశానవాటిక ప్రహరీని ఆనుకుని ఉన్న స్థలంలో ఎన్‌హెచ్‌కు సమాంతరంగా ఏర్పాటు చేయాలని నగరపంచాయతీ పాలకవర్గం కౌన్సిల్‌లో తీర్మానించింది. ఇందుకు సంబంధించి కడప డీఎస్పీ స్థలాన్ని పరిశీలించారు. బంకు ఏర్పాటుకు పోలీసుతోపాటు, అగ్నిమాపకశాఖ వారు కూడా సర్టిఫై చేయాల్సి వుంది. డీఎస్పీ కలెక్టర్‌కు నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం.