తోక ఎముక నొప్పి తగ్గాలంటే...

ABN , First Publish Date - 2022-03-01T05:30:00+05:30 IST

తోక ఎముక నొప్పి కూర్చోనివ్వదు, పడుకోనివ్వదు. కాలకృత్యాలు

తోక ఎముక నొప్పి తగ్గాలంటే...

తోక ఎముక నొప్పి కూర్చోనివ్వదు, పడుకోనివ్వదు. కాలకృత్యాలు తీర్చుకునేటప్పుడు విపరీతంగా పెరిగిపోయే ఈ నొప్పిని గృహ వైద్యంతో తగ్గించుకునే వీలుంది. అదెలాగంటే...


మర్దన: తోక ఎముక పక్కనుండే లివేటర్‌ యాని కండరాన్ని వదులు చేస్తే తోక ఎముక నొప్పి అదుపులోకి వస్తుంది. ఇందుకోసం బోర్లా పడుకుని, వేరొకరి సహాయంతో తోక ఎముక దగ్గర మర్దన చేయించుకోవాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేయగలిగితే నొప్పి క్రమేపీ తగ్గిపోతుంది.


విటమిన్లు: విటమిన్‌ డి, బి6, బి12.. ఈ విటమన్లు ఎముకల ఆరోగ్యానికి కీలకం. ఈ విటమిన్లలో లోపాలు తలెత్తితే, ఎముకల సమస్యలు మొదలవుతాయి. ఈ విటమిన్లను క్యాల్షియంతో కలిపి తీసుకున్నా తోక ఎముక నొప్పి అదుపులోకి వస్తుంది.


ఆముదం: ఆముదంలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు తోక ఎముక నొప్పిని పారదోలతాయి. ఇది యాంటీమైక్రోబియల్‌ ఏజెంట్‌ కూడా. కాబట్టి ఆహారంలో కొద్ది పరిమాణంలో ఆముదం చేర్చుకోవాలి.


ఎప్సమ్‌ సాల్ట్‌: ఎప్సమ్‌ సాల్ట్‌ కలిపిన గోరువెచ్చని నీళ్లతో బాత్‌ టబ్‌ నింపి, సేద తీరడం వల్ల శరీరం స్వాంతన పొందుతుంది. ఒత్తిడి వదలడం వల్ల నడుము దగ్గరి కండరాలు వదులై తోక ఎముక నొప్పి కూడా తగ్గుతుంది. ఎప్సమ్‌ సాల్ట్‌ ఒంట్లోని టాక్సిన్లను కూడా పారదోలుతుంది. కాబట్టి ప్రతి రోజూ కనీసం అరగంట పాటు ఎప్సమ్‌ సాల్ట్‌ నీళ్లలో సేద తీరాలి. ఇలా కనీసం వారం రోజుల పాటు చేస్తే టెయిల్‌ బోన్‌ నొప్పి తగ్గుముఖం పడుతుంది. 


Updated Date - 2022-03-01T05:30:00+05:30 IST