Abn logo
Mar 27 2020 @ 04:18AM

ప్రార్థనామందిరాలన్నింటినీ మూసివేయాలి

మతపెద్దలు, స్థానిక అధికారులు ప్రత్యేక చొరవచూపాలి


అనంతపురం క్లాక్‌టవర్‌, మార్చి 26: కరోనా వైరస్‌ నివారణకు తీసుకుంటున్న చ ర్యల్లో భాగంగా కలెక్టర్‌ ఆదేశాల మేరకు జిల్లాలోని మసీదులు, దర్గాలు, చర్చిలు వంటి ప్రార్థనామందిరాలన్నింటినీ మూసివేయాలని జిల్లా మైనార్టీ అధికారి మ హ్మద్‌రఫీ సూచించారు. వైరస్‌ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ముస్లిం, క్రైస్తవ మతపెద్దలు ఆయా మసీదులు, దర్గాలు, చర్చిల్లో ప్రచార పత్రాలు ప్రదర్శించి కనీస అవగాహన కల్పించాలన్నారు. అలాగే వాటన్నింటినీ పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.


ప్రతి ఒక్కరూ చేతులు శుభ్రం చేసుకోకుండా కళ్లు, ముక్కు, నోరు తాకరాదన్నారు. దగ్గు, జలుబు, తుమ్ములు, జ్వరం వంటి లక్షణా లున్న వారి నుంచి కనీసం రెండు మీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలన్నారు. మతపెద్దలు, స్థానిక అధికారులు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. గత్యంతరం లేని  పరిస్థితుల్లో ప్రతి ఒక్కరి మధ్య దూరం కనీసం రెండు మీటర్లు ఉండేలా చూసుకోవాలన్నారు. భారీ సంఖ్యలో జనం గుమికూడకుండా (20 మందికి మించకుండా) చూసుకోవాలన్నారు. ఏప్రిల్‌ 14వ తేదీ వరకు మసీదులు, దర్గాలు, చర్చితో పాటు మదరసాలను కూడా మూసివేయాలన్నారు. ప్రతి ఒక్కరూ పై సూచనలు, జాగ్రత్తలు పాటించి కరోనా వైరస్‌ మహమ్మారి నుంచి మనకు మనమే రక్షించుకుందామని పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement
Advertisement